పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలివే..?

కరోనా సెకండ్ వేవ్ పెద్దలను, పిల్లలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఎవరు ఎప్పుడు కరోనా బారిన పడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్ లో విటమిన్ ఎ, జింక్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలు నిత్యం క్యారెట్ తింటే […]

Written By: Navya, Updated On : April 7, 2021 11:07 am
Follow us on

కరోనా సెకండ్ వేవ్ పెద్దలను, పిల్లలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఎవరు ఎప్పుడు కరోనా బారిన పడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్ లో విటమిన్ ఎ, జింక్ పుష్కలంగా ఉంటాయి.

పిల్లలు నిత్యం క్యారెట్ తింటే మంచిది. క్యారెట్ తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. క్యారెట్ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. నట్స్ తినడం వల్ల కూడా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తినడం వల్ల పిల్లలకు సంపూర్ణ పోషణ లభించడంతో పాటు బలంగా తయారవుతారు.

పిల్లలు నిమ్మజాతికి చెందిన పండ్లు తినడం ద్వారా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నిమ్మజాతి పండ్లు . దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా చేయడంలో రక్షిస్తాయి. పిల్లలకు కచ్చితంగా పెరుగును తినిపించాలి. శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నశింపజేయడంలో పెరుగు తోడ్పడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దృఢంగా చేస్తుంది.

పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో కూడా వాళ్లు ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లలు జంక్ ఫుడ్ తింటే మాత్రం రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.