తమిళనాడు రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరయ్యా అంటే ఠక్కున అందరూ చెప్పే పేరు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అని. అధికార అన్నాడీఎంకే ఓటమి ఖాయమని.. ఈసారి స్టాలిన్ సీఎం కావడం ఖాయమని సర్వేలు ఘోషిస్తున్నాయి.
అటు రజినీకాంత్ రంగంలోకి దిగకపోవడం.. ఇటు శశికళను బీజేపీ కంట్రోల్ చేయడంతో స్టాలిన్ గెలుపు నల్లేరుపై నడకగా మారిందంటున్నారు.
అయితే ఒక సీఎం క్యాండిడేట్ అంటే ఎంత తెలిసి ఉండాలి. రాజకీయాల్లో ఆరితేరి ఉండాలి. మాటల మాంత్రికుడై ఉండాలి. ఒక జయలలిత, కరుణానిధిలా ఉండాలి. అయితే స్టాలిన్ వారుసుడిగా బాగానే ఎంట్రీ ఈ ఎన్నికల్లో ప్రచారం చేశాడు.
ఈరోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ చెన్నైలోని సియెట్ కాలేజీ , తేనంపేట్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసేందుకు రాగా జర్నలిస్టులంతా కెమెరాలు పట్టుకొని ఫొటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు.
అయితే స్టాలిన్ కు మాత్రం ఎవరో పక్కన అధికారి ఈవీఎంపైన చూపిస్తూ కనిపించాడు. స్టాలిన్ కు గుర్తు కనిపించలేదా? లేక మరేదైనా సహాయమా క్లారిటీగా తెలియదు కానీ.. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాబోయే సీఎం ఆయన పార్టీ గుర్తు కూడా కనిపెట్టలేదని.. ఈవీఎం మిషన్ పై గుర్తు దొరకని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడు? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే నిజంగా ఇది గుర్తు కనిపించకపోవడం వల్ల అధికారి ఈవీఎం మిషన్ దగ్గరకు వచ్చాడా? మరేదైనా లోపమా? అసలు ఓటు వేసే టప్పుడు ఎవరూ రాని చోటకు స్టాలిన్ వద్దకు అతడు ఎందుకు వచ్చాడన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఈ వివాదంపై స్టాలిన్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.