దేశంలో చాలామంది తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా వాళ్లకు తెలీకుండానే వారిని ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. చాలామంది వ్యాధి మొదట్లో లక్షణాలను గుర్తించలేక పోవడం వల్ల చిన్న సమస్య పెద్ద సమస్య కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే స్మార్ట్ బ్యాండ్ సహాయంతో ఆ అనారోగ్య సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు.
Also Read: ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?
కర్ణాటకలోని మైసూరుకు చెందిన దీప్తి ఘనాపాటి హెగ్డే కరోనా లక్షణాలతో పాటు ఇతర శరీర వ్యాధులను గుర్తించే స్మార్ట్ బ్యాండ్ ను తయారు చేసింది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో దీప్తి తయారు చేసిన స్మార్ట్ బ్యాండ్ కు 25 వేల రూపాయల నగదు బహుమతి లభించింది. పట్టణ ప్రజలతో పోల్చి చూస్తే గ్రామీణ ప్రజలకు ఈ స్మార్ట్ బాండ్ వల్ల ప్రయోజనం కలగనుంది. ఆస్పత్రులు లేని ప్రాంతాల్లో ఈ స్మార్ట్ బ్యాండ్ ల వల్ల సులభంగా వ్యాధి గురించి తెలుసుకోవచ్చు.
ఈ స్మార్ట్ బ్యాండ్ గర్భిణుల్లో తలెత్తే అనారోగ్య సమస్యలను సైతం సులువుగా గుర్తించగలదు. మారుమూల గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలకు ఈ స్మార్ట్ బ్యాండ్ తో చెక్ పెట్టవచ్చని దీప్తి భావిస్తోంది. ఈ స్మార్ట్ బ్యాండ్ తో మొబైల్ యాప్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే యాప్ కు నోటిఫికేషన్ ద్వారా అనారోగ్య సమస్యలు తెలుస్తాయి.
Also Read: డయాబెటిస్ రోగులు గుండెను కాపాడుకోవడం ఎలా అంటే..?
దీప్తి ప్రస్తుతం . మైసూరులోని బేస్ పీయూ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బిల్డింగ్ సెల్ఫ్ రిలియంట్ స్మార్ట్ విలేజెస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెఫ్ట్ గురించి 3,000 మంది ప్రాజెక్టులు సబ్మిట్ చేయగా దీప్తికి ఫస్ట్ ఫ్రైజ్ రావడం గమనార్హం. అనారోగ్య సమస్య పెద్దదైతే అంబులెన్స్‌కు సమాచారం అందించడం, లైవ్ లొకేషన్ వివరాలు షేర్ చేయడం ఈ స్మార్ట్ బ్యాండ్ ప్రత్యేకత.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం