https://oktelugu.com/

రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందే.. ఫ్యాన్స్ నిరసన

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా మారింది రజినీకాంత్ పరిస్థితి. దాదాపు 25 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తానంటూ ఏమార్చి ఇప్పుడు అనారోగ్యం కారణంతో వైదొలగడంతో రజినీకాంత్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న రజినీకాంత్ అభిమానులు ఇప్పుడు చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి తరలివస్తున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లో రావాల్సిందేనంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు తమిళనాట రజినీకాంత్ ఫ్యాన్స్ ఆందోళనలతో హోరెత్తుతోంది. చెన్నైలోని ఆయన నివాసం.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమాన గణం జినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2020 4:27 pm
    Follow us on

    ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా మారింది రజినీకాంత్ పరిస్థితి. దాదాపు 25 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తానంటూ ఏమార్చి ఇప్పుడు అనారోగ్యం కారణంతో వైదొలగడంతో రజినీకాంత్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న రజినీకాంత్ అభిమానులు ఇప్పుడు చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి తరలివస్తున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లో రావాల్సిందేనంటూ నిరసనలు తెలుపుతున్నారు.

    ఇప్పుడు తమిళనాట రజినీకాంత్ ఫ్యాన్స్ ఆందోళనలతో హోరెత్తుతోంది. చెన్నైలోని ఆయన నివాసం.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమాన గణం జినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా చోట్ల రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ తో నిరసనలు కొనసాగిస్తున్నారు.

    రజినీకాంత్ అభిమాన సంఘాలన్నీ ఆయన నిర్ణయంపై కలతచెందాయి. ఇప్పటికే 31న పార్టీ ప్రకటిస్తారని రజినీ ఏర్పాట్లు చేయగా.. వారంతా ఇప్పుడు ఆయన వెనక్కి తగ్డడాన్ని తట్టుకోలేకపోతున్నారు.

    రజినీకాంత్ గుర్తు ఆటో అని ఇప్పటికే పెద్ద ఎత్తున ముద్రించి సిద్ధం చేశారు. ఆయన పార్టీను రజినీ అభిమానులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వైదొలగడాన్ని రజినీ అభిమానులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.