Mutton Bone Soup: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. పౌష్టికాహారం అనేది ప్రత్యేకంగా ఉండదు. కొన్ని పదార్థాల్లో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు శరీరానికి అందించడమే పౌష్టికాహారం. అయితే ప్రోటీన్లు, ఖనిజాలు ఏ పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయో.. వాటిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. సరైన ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. కొన్ని రకాల వ్యాధులను నయం కూడా చేస్తుందని పురాతన కాల పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకప్పుడు వైద్య సదుపాయాలు అందుబాటులో లేని సమయంలో కొన్ని ఆహార పదార్థాలను క్రమ పద్ధతిలో తీసుకొని వ్యాధులను రాకుండా చేశామని పేర్కొంటూ ఉంటారు. వీటిలో మటన్ సూప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మటన్ సూప్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు?
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
మటన్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయితే కేవలం మటన్ లో కాకుండా గొర్రె లేదా మేకకు సంబంధించిన కాళ్ల సూప్ తాగడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని కొందరు చెబుతుంటారు. దీనినే కొన్ని ఏరియాల్లో పాయ అని అంటారు. ఇది తీసుకోవడం వల్ల మానవ శరీరంలోని ఎముకలు దృఢంగా ఉంటాయని పేర్కొంటారు. అసలు మటన్ సూప్ తాగడం వల్ల మానవ శరీరంలోని ఎముకలు ఎందుకు దృఢంగా ఉంటాయి?
గొర్రె లేదా మేక కాళ్లలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, జింకు వంటి కనిజాలు ఉంటాయని హార్వర్డ్ స్కూల్ తెలిపింది. పొట్టేలు కాళ్ళలో కొలాజిన్, జలటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి మానవులు తీసుకోవడం వల్ల వారి ఎముకలకు లూబ్రికేంట్ గా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు.. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు పొట్టేలు సూప్ తీసుకోవడం వల్ల త్వరగా నయం అవకాశం ఎక్కువగా ఉందని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా జ్వరం లేదా జలుబు వచ్చినప్పుడు కూడా ఈ సూప్ తాగడం వల్ల వెంటనే తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యం జరిగినా.. ఏదైనా ప్రత్యేక రోజుల్లో ఈ మటన్ పాయను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
అయితే క్యాన్సర్ బారిన పడిన వారు కూడా ఈ సూప్ ను తాగుతూ ఉంటారు. క్యాన్సర్ ఉన్నవారికి కీమోతెరపి ఎక్కువగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టుపై ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో వారికి ఇచ్చే ఆహారంలో ఎముకల సూప్ తప్పనిసరిగా చేరుస్తారు. ఎందుకంటే మటన్ సూప్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేవారు పాయ తీసుకోవడం వల్ల దృఢంగా మారుతారు.
ఈ ఎముకల సూప్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రం ఇది నష్టాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో అధికమైనా కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది తాగడం వల్ల వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లెగ్ బోన్ సూప్ తయారు చేసుకునేవారు వాటిని శుభ్రంగా కడగాలి. వీటిలో ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి ఎంత వేడి చేసినా ఒక్కోసారి తొలగిపోయే అవకాశం ఉండదు. అందువల్ల బాగా శుభ్రం చేసిన తర్వాతనే వీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి.