ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. విత్ డ్రాపై ఆంక్షలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. నేటి నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఈ బ్యాంక్ కస్టమర్లకు మారటోరియం అమలు కానుంది. ఆర్బీఐ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సైతం విడుదలైంది. మారటోరియం అమలులో ఉన్నన్ని రోజులు ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉన్నా 25,000 రూపాయలు […]

Written By: Navya, Updated On : November 18, 2020 8:25 am
Follow us on


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. నేటి నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఈ బ్యాంక్ కస్టమర్లకు మారటోరియం అమలు కానుంది. ఆర్బీఐ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సైతం విడుదలైంది. మారటోరియం అమలులో ఉన్నన్ని రోజులు ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉన్నా 25,000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు.

అయితే ఎవరికైనా అత్యవసరమైతే ఆర్బీఐ అనుమతితో రూ.25,000 కంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. రోజురోజుకు లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో కేంద్రం, ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోర్డ్ డైరెక్టర్లను తొలగించడంతో పాటు అడ్మినిస్ట్రేటర్‌గా కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మనోహరన్ ను నియమించింది.

గతంలో ఆర్బీఐ యస్ బ్యాంక్ విషయంలో ఈ తరహా నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం లక్ష్మీవిలాస్ బ్యాంక్ విషయంలో ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. అయితే మారటోరియం విధించిననంత మాత్రాన ఖాతాదారులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ఖాతాదారులు డబ్బు గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్బీఐ లక్ష్మీవిలాస్ బ్యాంక్ సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న డీబీఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విలీనానికి లక్ష్మీవిలాస్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే డీబీఎస్‌ తమ అనుబంధ సంస్థ డీబీఐఎల్‌ ద్వారా 2,500 కోట్ల రూపాయల నిధులను ఇవ్వనుంది.