https://oktelugu.com/

Haelth Tips : ఈ చాయ్ తాగండి.. వారం రోజుల్లో బరువు తగ్గండిలా!

ఉదయం లేచిన వెంటనే ఎక్కువ శాతం మంది టీ తాగుతుంటారు. టీ, కాఫీ వంటివి కాకుండా అల్లం, దాల్చిన చెక్క, నిమ్మకాయలతో కలిపిన టీని తయారు చేసి తాగితే ఈజీగా వారం రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఒక పాత్రలో గ్లాసు నీరు వేసి అందులో అల్లం, దాల్చిన చెక్క, నిమ్మకాయలు వేసి బాగా మరగనివ్వాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 25, 2024 / 03:29 AM IST

    Mixed Tea

    Follow us on

    Haelth Tips :  స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. కొంచెం లావుగా ఉన్నామని ఫీల్ అయ్యి.. బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈజీగా బరువు తగ్గాలని డైట్ ఫాలో కావడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తారు. ఎన్ని నియమాలు చేసిన బరువు తగ్గరు. ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతున్నారు. బయట ఎక్కడ ఏం దొరికితే అదే తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వులను శరీరంలో పెంచుకుంటున్నారు. దీనివల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో వండిన ఫుడ్ నచ్చకపోవడం వల్ల కొందరు డైలీ బయట తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వర్క్ బిజీ, ఇంట్లో పనుల వల్ల బయట ఫుడ్ తింటున్నారు. తినాల్సిన బయట ఫుడ్ అంతా తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అమ్మాయిలు సులువుగా బరువు తగ్గాలంటే తిండి మానేయడం, జిమ్ వంటివి మాత్రమే చేయక్కర్లేదు. ఉదయం లేచిన వెంటనే ఈ టీని తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. ఇంతకీ ఆ టీ ఏంటి? ఎలా తాగితే బరువు తగ్గుతారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఉదయం లేచిన వెంటనే ఎక్కువ శాతం మంది టీ తాగుతుంటారు. టీ, కాఫీ వంటివి కాకుండా అల్లం, దాల్చిన చెక్క, నిమ్మకాయలతో కలిపిన టీని తయారు చేసి తాగితే ఈజీగా వారం రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఒక పాత్రలో గ్లాసు నీరు వేసి అందులో అల్లం, దాల్చిన చెక్క, నిమ్మకాయలు వేసి బాగా మరగనివ్వాలి. ఇందులో షుగర్ వేయకూడదు. ఆ మూడింటిని నీరు పీల్చిన తర్వాత వడబోసి తాగాలి. ఇలా డైలీ రోజు ఉదయం చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. ఈ టీని తాగడం వల్ల కేవలం బరువు మాత్రమే తగ్గకుండా జీవ క్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దాల్చిన చెక్కలోని థర్మోజెనిక్ లక్షణాలు జీవక్రియ రేటును పెంచుతాయి. అలాగే కొవ్వును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. కొందరు బరువు తగ్గాలని పూర్తిగా తినడం మానేస్తారు. అలాంటి వారికి కూడా ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. ఈ టీలో వాడే అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.

    బరువు తగ్గాలని చాలా మంది ఆహారం తినడం మానేస్తారు. దీంతో ఆకలిని కంట్రోల్ చేసుకోలేరు. దీనివల్ల గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు ఈ టీని తయారు చేసుకుని తాగడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. వీటిలో ఉండే దాల్చిన చెక్కలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ టీ మధుమేహం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో ఇన్సులిన్‌ను నిరోధించే కణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దాల్చిన చెక్కలో కూడా ఉన్నాయి. ఈ రెండు కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.