More germs on the chopping board: కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డులో.. టాయిలెట్ సీట్ కంటే క్రిములు ఎక్కువా?ప్రతి ఒక్కరి ఇంట్లో వంట వండటం అనేది కామన్. ఇంట్లో వండిన వంట తినాలంటే వంటగది శుభ్రంగా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే వండే వంటగది శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే లేని పోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొందరు వంటగదిని అసలు శుభ్రంగా ఉంచుకోరు. వంట చేసేటప్పుడు కొందరు అప్పుడే క్లీన్ చేస్తారు. మరికొందరు వాటిని అలాగే వదిలేస్తారు. దీనివల్ల వంటగది అంతా క్రిములతో నిండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఒకప్పుడు కత్తిపీటలో కూరగాయలు కట్ చేసేవారు. కానీ ఈరోజుల్లో అందరూ కూడా చాపింగ్ బోర్డుపై కట్ చేస్తున్నారు. అయితే టాయిలెట్ సీట్ కంటే ఈ చాపింగ్ బోర్డులోనే ఎక్కువ క్రిములు ఉన్నాయట. చాపింగ్ బోర్డును కట్ చేసిన తర్వాత కొందరు శుభ్రం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా చాపింగ్ బోర్డు మీద కూరగాయలు కట్ చేసిన తర్వాత ఏదో జస్ట్ నీటితో కడిగి పెట్టేస్తారు. కొన్నిసార్లు మాంసం, చేపలు వంటివి కూడా కట్ చేస్తారు. వీటిని కట్ చేసిన తర్వాత ఎంత కడిగిన కూడా ఎక్కడో ఒక దగ్గర బ్యాక్టీరియా ఉండిపోతుంది. సాధారణంగా కూరగాయలను కూడా రసాయనాలతో పండిస్తారు. వీటివల్ల చాపింగ్ బోర్డుపై హానికరమైన బ్యాక్టీరియా ఉండిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యూలర్‌గా ప్రతి ఇంట్లో వీటిని వాడుతారు. వీటిని వాడిన తర్వాత సరిగ్గా శుభ్రం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే బ్యాక్టీరియా ఉండిపోతుంది. ఇలా డైలీ కట్ చేస్తుంటే బ్యాక్టీరియా రోజురోజుకి పెరుగుతుంది. కానీ తగ్గదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి డైలీ చాపింగ్ బోర్డును శుభ్రంగా చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.
చాపింగ్ బోర్డును ఎలా శుభ్రం చేయాలంటే?
కూరగాయలు, మాంసం వంటివి కట్ చేసిన తర్వాత గోరువెచ్చని నీరుతో లేదా డిష్ సోప్‌తో శుభ్రం చేయాలి. వీటితో పాటు వైట్ వెనిగర్ లేదా నిమ్మరసంతో చాపింగ్ బోర్డును క్లీన్ చేస్తే.. బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. ఇవే కాకుండా బేకింగ్ సోడా, ఉప్పు వేసిన పది నిమిషాల తర్వాత వేడి నీరు వేసి స్పాంజ్‌తో క్లీన్ చేస్తే.. చాపింగ్ బోర్డు శుభ్రం అవుతుంది. ఇలా శుభ్రం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఎన్నిసార్లు కూరగాయలు కట్ చేస్తే అన్నిసార్లు చాపింగ్ బోర్డును క్లిన్ చేయాలి. కొందరు పండ్లు వంటివి కట్ చేస్తారు. ఇవే కదా అని వదిలేస్తారు. కానీ ఏ చిన్న వస్తువు చాపింగ్ బోర్డుపై కట్ చేసిన కూడా వెంటనే శుభ్రం చేసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.