Moongdal: అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పప్పు తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!

సాధారణంగా పెసర పప్పును కూరలు లేదా పప్పుగా ఎక్కువగా వాడుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పప్పును తినకూడదట. మరి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పెసరపప్పును తినకూడదో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 31, 2024 5:08 pm

Moong dal

Follow us on

Moongdal: శరీర ఆరోగ్యానికి పప్పులు చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల బలంగా ఉంటారు. ఇందులో ప్రొటీన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఎక్కువ మంది కందిపప్పు, పెసరపెప్పు, శనగ పప్పులు ఎక్కువగా తీసుకుంటారు. అయితే కందిపప్పు అందరి ఆరోగ్యానికి మంచిదే. కానీ పెసరపప్పు కొందరి ఆరోగ్యానికి మంచిది కాదు. సాధారణంగా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, రాగి, ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెసరపప్పును తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పప్పు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, బరువు కూడా తగ్గుతారని చాలా మంది అంటుంటారు. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందట. సాధారణంగా పప్పు లేదా కూరల్లో ఎక్కువగా దీన్ని వాడుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పప్పును తినకూడదట. మరి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పెసరపప్పును తినకూడదో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

కిడ్నీ సమస్యలు
ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు అసలు పెసర పప్పును తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆక్సలేట్లు ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెసర పప్పును తినవద్దు. అవసరమైతే కందిపప్పు ఆరోగ్యానికి మంచిది. అలాగే ఏదైనా గాయం అయిన వారు కూడా ఈ పెసర పప్పును తినకూడదు. దీనివల్ల గాయం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. గాయం తొందరగా మానాలంటే కంది పప్పు బెటర్. కాబట్టి పెసర పప్పు బదులు కందిపప్పు తినడం డైలీ అలవాటు చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల ఆరోగ్యానికి కూడా బలం అందుతుంది. నీరసం, అలసట అన్ని కూడా తగ్గుతాయి.

గ్యాస్ సమస్యలు
పెసర పప్పు తినడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయి. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కూడా కొందరికి అవుతాయి. గాస్ట్రిక్, జీర్ణ సమస్యలు ఉన్నవారు పెసర పప్పు తినకపోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఉన్న సమస్యలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవడం మంచిది.

యూరిక్ యాసిడ్
పెసర పప్పులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్‌ను పెంచుతుంది. దీనివల్ల ఆరోగ్యానికి ప్రమాదం. కాబట్టి పెసర పప్పును తక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది. కొందరు పప్పు చారుగా కూడా ఈ పెసర పప్పును ఎక్కువగా వాడుతుంటారు. ఇలా కూడా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పెసర పప్పును అయితే అతిగా తినకపోవడం మంచిది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.