https://oktelugu.com/

body : బాడీలో అసలు కాలిపోని పార్ట్ ఏంటో మీకు తెలుసా?

చనిపోయిన వెంటనే దహన సంస్కరణలు చేపడతారు. శవాన్ని కాల్చడం మొదలు పెడితే కొన్ని గంటల్లోనే బాడీ మొత్తం బూడిద అయిపోతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2024 / 02:02 AM IST
    Follow us on

    body : పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదు. ఒకరు ముందు చనిపోతే ఇంకొందరు వెనుక మరణిస్తారు. కానీ మరణించడం మాత్రం ఫిక్స్. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు కొందరు శవాన్ని మట్టిలో పాతిపెడతారు. మరికొందరు శవాన్ని కాల్చుతారు. సాధారణంగా చాలా మందికి కాల్చుతారు. పిల్లలను అయితే కాల్చకుండా మట్టిలో పాతిపెడతారు. అయితే మన శవాన్ని కాల్చినప్పుడు శరీరం మొత్తం కాలిపోతుంది. మన బాడీకి కాస్త మంట తగిలితే చాలు ఇక. బాడీ మొత్తం మంటల్లో కాలిపోతుంది. కానీ ఒక్క పార్ట్ మాత్రం అసలు కాలదట. ఎవరైనా చనిపోయినప్పుడు బాడీ కాల్చితే మొత్తం కాలిపోయిందని అంటారు. వర్షం ఏదైనా పడటం వల్ల కొన్నిసార్లు ఆ పార్ట్ కాలడం లేదు, ఆలస్యంగా కాలుతుందని అంటుంటారు. కానీ శవాన్ని కాల్చేటప్పుడు ఎంత ప్రయత్నించిన బాడీలో ఒక్క పార్ట్ కాలకుండా ఉంటుందట. మరి ఆ పార్ట్ ఏంటి? నిజంగానే బాడీలో ఒక్క పార్ట్ కాలకుండా ఉంటుందా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    చనిపోయిన వెంటనే దహన సంస్కరణలు చేపడతారు. శవాన్ని కాల్చడం మొదలు పెడితే కొన్ని గంటల్లోనే బాడీ మొత్తం బూడిద అయిపోతుంది. కానీ మన శరీరంలోని పళ్లు మాత్రం ఎంత సమయం కాలిన కూడా బూడిద కావు. చర్మం అంతా మెత్తగా లేకపోవడం వల్ల కాస్త ఆలస్యంగా అయిన కూడా బూడిద కావాలి. కానీ పళ్లు కొంచెం కూడా బూడిద కావు. మన శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. అయితే పళ్లు మంటల్లో బూడిద కాకుండా అలా ఉండటానికి సైన్స్ ముఖ్య కారణం. సాధారణంగా పళ్లు చాలా గట్టిగా ఉంటాయి. ఇందులోని పోషకాలు కాల్షియం, ఫాస్పేట్‌లతో తయారు కావడం వల్ల చాలా పళ్లు చాలా దృఢంగా ఉంటాయి. వీటిని ఎంత ఎక్కువ టెంపరేచర్‌లో కాల్చిన కూడా అసలు బూడిద కావు. మిగతా శరీర భాగాలు కాలిపోతాయి. కానీ పళ్లు మాత్రం అలానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సైంటిఫిక్ కారణం వల్ల బూడిద కావట్లేదని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత? అబద్ధమెంత? పూర్తిగా తెలియదు. పళ్లు నిజంగానే మంటల్లో కాలవా? సైంటిఫిక్ రిజన్ ఇదేనా? ఇంకా ఏదైనా ఉందా? లేదా? అని పరిశోధనలు జరిగితేనే వివరాలు తెలుస్తాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. గూగుల్ ద్వారా ఈ విషయాలు తెలియజేయడం జరిగింది.