Milk: రాత్రి హాయ్ గా నిద్రపోవాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ఒత్తిడి, పనులు, బిజీ లైఫ్ లకు నిద్ర పట్టడం లేదు కదా. అయితే ఓ గ్లాసు ఫుల్ గా తాగేసి హాయిగా నిద్రపోండి. అందులో కొన్ని పదార్థాలను కూడా కలుపుకోండి. మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఏంటి ఓ గ్లాసు తాగమని చెబుతున్నారు అని ఆశ్చర్యపోతున్నారా. అయ్యో పొరపాటు పడకండి. ఓ గ్లాసే కానీ వైన్ కాదు మిల్క్. ఈ పాలల్లో కాస్త కుంకుమపువ్వు, కొద్దిగా జాజికాయ పొడి కలిపి తీసుకోవడం మరీ మంచిది. ఈ పాలని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకోండి.
ఓ గ్లాసు పాలలో జాజికాయ, కుంకుమ పువ్వును కలిపి తాగితే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ పాలు మెదడు, బాడీపై పాజిటీవ్ ఎఫెక్ట్‌ని చూపిస్తాయి. ఎందుకంటే, జాజికాయ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే, ఎముకలని బలంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు జీర్ణ శక్తిని పెంచుతుంది. మరీ ముఖ్యంగా, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు పాలలో కుంకుమపువ్వులో క్రోసిటిన్, క్రోసిన్ ఉంటాయి కాబట్టి బాడీలో కణితులు ఏర్పడకుండా చేస్తాయి.
పాలలో కుంకుమపువ్వు కలిపి తాగేవారు ప్రాణంతాక సమస్యలు దూరంగా ఉంటారు. అంతేకాదు జాజికాయ, కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే శరీరంలో హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయట. దీనివల్ల రాత్రంతా హ్యాపీగా నిద్రపోవచ్చు. పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఇవి బ్రెయిన్, బాడీని శాంతపరిచి.. సంతోషకరమైన ఫీలింగ్ ను ఇస్తాయి.ఇక థైరాయిడ్ సమస్యల్ని కంట్రోల్ చేయడానికి, ఇన్సులిన్ నిరోధకత, నిద్రలేమి, శారీరక బలహీనతని తగ్గిస్తాయి ఈ పాలు .
ప్రశాంతమైన నిద్రని అందించేందుకు నాడీవ్యవస్థ మీద అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మరి వీటిని ఎలా మిక్స్ చేయాలి అనుకుంటున్నారా? ముందుగా పాలను వేడి చేసి దీనిలో కుంకుమపువ్వు రేకులు, తాజాగా తయారు చేసిన జాజికాయ పొడిని వేసి కలపుకొని.. రుచి కోసం ఖర్జూరాలు తురిమి బాదం పప్పు వేసి కలిపి తాగితే సరిపోతుంది.