Mental Health Tips: చాలా మంది ప్రస్తుతం డల్ గా, నీరసంగా కూర్చుంటున్నారు. ఏదో కోల్పోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు తెగ ఆందోళన చెందుతూ టెన్షన్ పడుతూ, ఆరాటపడుతూ కనిపిస్తుంటారు. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించారా? ఎక్కువ థింకింగ్ వల్ల మాత్రమే కాదు. జీవన శైలి కూడా దీనికి ఒక కారణమే అంటున్నాయి అధ్యయనాలు. ఆహారం, వ్యాయామం, నిద్ర, సామాజిక సంబంధం వంటి జీవనశైలి అంశాలు మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అనారోగ్యకరమైన అలవాట్లు నిరాశ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు దానిని నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడతాయి.
Also Read: లేవగానే మొబైల్ పడుతున్నారా? ముందు ఈ పనులు చేయండి
అవసరమైన పోషకాలు లేని సరైన ఆహారం మెదడు పనితీరు, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల నిరాశ, విచారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన ఆహారం మానసిక ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.
శారీరక శ్రమ: మీరు ఒకే చోట కూర్చొంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఇలా ఒక చోటుకు మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు. లేదంటే నెమ్మదిగా మీరు నిరాశకు గురవుతారు. శారీరక శ్రమను తగ్గించడం వల్ల మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే, ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తగినంత లేదా నాణ్యత లేని నిద్ర మానసిక స్థితిని మరింత తగ్గిస్తుంది. నిరాశను పెంచుతుంది. రోజువారీ నిద్ర షెడ్యూల్‌ను రూపొందించడం, నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఒంటరితనం, సామాజిక మద్దతు లేకపోవడం నిరాశ ప్రమాదాన్ని పెంచుతుంది. బలమైన సామాజిక సంబంధాలను సృష్టించడం, నిర్వహించడం ఒత్తిడి నుంచి రక్షించగలదు. ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
రిలాక్స్: వర్క్ లో ఉన్నా సరే లీవ్ లో ఉన్నా సరే ఆ ఫోన్ కు మాత్రమే అతుక్కొని పోకుండా కాస్త రిలాక్స్ అవడం చాలా ముఖ్యం. బిజీ లైఫ్ లో అస్తమానం బిజీగా ఉండటం కాకుండా కాస్త ప్రకృతితో మమేకం అవ్వాలి. లేదంటే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిలాక్స్ లేకుండా మనసుకు, మైండ్ కు ఒత్తిడి పెడుతుంటే మీ శరీరం మాత్రమే కాదు మనసు కూడా చాలా సమస్యల్లో పడుతుంది. ఇది ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది అని మర్చిపోవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
Also Read: లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండిలా!