Mahendra Singh Dhoni and Ram Charan : రామ్ చరణ్(Global star Ram charan), బుచ్చి బాబు(Buchi Babu Sana) మూవీ విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ఉంది. ఈ క్రమం లోనే వీళ్ళ కాంబినేషన్ గురించి సోషల్ మీడియా లో రోజుకో వార్త ప్రచారం అవుతూనే ఉంది. అవి నిజమో కాదో తెలియదు కానీ, ఈ వార్తలను మాత్రం అభిమానులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యం లో జరిగే ఒక స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి క్రికెట్, వాలీ బాల్, కబడ్డీ, కుస్తీ ఇలా అన్ని క్రీడల్లో గొప్ప ప్రావీణ్యం ఉంటుందట. గ్రామాల్లో జరిగే క్రీడా పోటీలలో రామ్ చరణ్ ని అద్దె కు తమ టీంలోకి తీసుకొని ఆడించుకుంటూ ఉంటారట పలు టీం యజమానులు. ఆసక్తికరమైన పాయింట్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చి బాబు తెరకెక్కిస్తున్నాడు. పర్ఫెక్ట్ గా డీల్ చేస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు అవుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో క్రికెటర్ ధోని నటిస్తున్నాడా..?
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ప్రముఖ క్రీడాకారుడు, ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని, ఇందులో ఆయన క్రికెటర్ గా కనిపిస్తాడంటూ వార్తలు వినిపించాయి. దీనిపై మూవీ టీం స్పందించింది, సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అసలు మా సినిమాలో అలాంటి క్యారక్టర్ లేదు. దయచేసి అభిమానులు సోషల్ మీడియా లో వచ్చే ప్రతీ వార్తని నమ్మకండి. ఏదైనా ఉంటె మేము అధికారికంగా చేపట్టాము. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం ని మించిన సినిమా అవ్వబోతుంది. ఆయన నట విశ్వరూపం చూస్తారు. అంటూ చెప్పుకొచ్చారు. ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, ఈ సినిమాకి కూడా నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యారు. రీసెంట్ గా ‘రాబిన్ హుడ్’ ప్రొమోషన్స్ లో పాల్గొన్న నిర్మాతలు, ఈ అంశాన్ని విలేఖరులు ప్రస్తావనకు తీసుకొని రాగా క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Jhanvi Kapoor) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా, జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఆమె చూసేందుకు చాలా అందంగా ఉంది, మంచి యాక్టింగ్ పొటెన్షియల్ కూడా ఉంది కానీ డైరెక్టర్ సరిగా వినియోగించుకోలేదని అప్పట్లో అందరూ కామెంట్స్ చేసారు. కానీ రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో మాత్రం ఆమెకు నటనకు గొప్ప ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కిందని అంటున్నారు. అదే విధంగా ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ కోలుకున్నాడు.
Also Read : #RC16 షూటింగ్ వీడియో లీక్..క్రికెట్ లో దుమ్ము లేపుతున్న రామ్ చరణ్..ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్!