Homeలైఫ్ స్టైల్Period irregularities reasons: నెలసరి సమయాల్లో సమస్యలు.. కారణాలు ఇవే కావచ్చు..

Period irregularities reasons: నెలసరి సమయాల్లో సమస్యలు.. కారణాలు ఇవే కావచ్చు..

Period irregularities reasons: మహిళల్లో నెలసరి (పీరియడ్స్) సమయానికి రాకపోవడం లేదా తరచూ ముందుగా లేదా ఆలస్యంగా రావడం సాధారణమే అని అనుకుంటారు. కానీ వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. ఇది కేవలం చిన్న సమస్యగా భావించకూడదు. జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా ఉంటాయి. సమయానికి గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ సమస్యను ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అంటే?

రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడటం, ఆందోళన చెందడం వల్ల శరీరంలోని హార్మోన్ స్థాయిలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కార్టిసోల్ హార్మోన్ పెరగడం వల్ల పీరియడ్స్ చక్రం అసమానంగా మారే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత లేకపోవడం కూడా నెలసరి ఆలస్యానికి దారితీస్తుంది.బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది సరైన ఆహారం తీసుకోకుండా డైటింగ్ చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక హార్మోన్లలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఐరన్, ప్రోటీన్, విటమిన్ల లోపం నెలసరి అసమానతకు కారణమవుతుంది. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా చేయడం హానికరం. అధికంగా వర్కౌట్స్ చేయడం వల్ల శరీరంలో శక్తి నిల్వలు తగ్గి హార్మోన్ స్థాయిలు మారిపోతాయి. ఇది పీరియడ్స్ ఆలస్యం కావడానికి లేదా పూర్తిగా ఆగిపోవడానికి కూడా కారణమవుతుంది.
ప్రతిరోజు తగినంత నిద్ర లేకపోవడం కూడా నెలసరి చక్రంపై ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర లేకపోతే శరీర హార్మోన్ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో పీరియడ్స్ టైమింగ్ మారుతుంది. కొన్ని మందుల వినియోగం, ముఖ్యంగా హార్మోన్ టాబ్లెట్స్, థైరాయిడ్ సమస్యలు, PCOS వంటి ఆరోగ్య సమస్యలు కూడా నెలసరి అసమానతకు కారణమవుతాయి. ఇవి ఉంటే తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం.

నెలసరి వరుసగా రెండు మూడు నెలలు తప్పిపోతే, చాలా ఎక్కువగా లేదా తక్కువగా బ్లీడింగ్ ఉంటే, తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. స్వయంగా మందులు వాడటం ప్రమాదకరం. నియమిత జీవనశైలి, సమతుల్య ఆహారం, తగిన వ్యాయామం, మానసిక ప్రశాంతత అనే విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే నెలసరి సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ఆరోగ్యంపై చిన్న మార్పులకే శ్రద్ధ పెట్టడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే అరికట్టవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version