Homeక్రీడలుక్రికెట్‌IPL 19 Virat Kohli performance: IPL 19, విరాట్ కోహ్లీ 19.. రన్ మెషిన్...

IPL 19 Virat Kohli performance: IPL 19, విరాట్ కోహ్లీ 19.. రన్ మెషిన్ ఏం చేసినా సరే అద్భుతమే

IPL 19 Virat Kohli performance: విరాట్ కోహ్లీ ఏ ముహూర్తంలో టీమిండియాలోకి ప్రవేశించాడో తెలియదు కానీ.. అతడు అడుగుపెడితే అద్భుతం. అతడు బ్యాట్ అందుకొని పరుగులు తీస్తుంటే సమ్మోహనం. వికెట్ల మధ్య చిరుత పులి మాదిరిగా పరుగులు తీస్తుంటే అనితర సాధ్యం. అందువల్లే ఈ తరంలో ఏ ఆటగాడు కూడా అందుకోలేని ఘనతలను విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. తన పేరును రన్ మిషన్ గా మార్చుకున్నాడు. గొప్ప గొప్ప ప్లేయర్లు ఫామ్ లేమి తో ఇబ్బంది పడుతుంటే.. విరాట్ మాత్రం వీరోచితంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

విరాట్ మైదానంలో అడుగుపెట్టి సింగిల్ పరుగు తీసినా సరే అది చరిత్ర అవుతుంది. సెంచరీ కొడితే విధ్వంసం అవుతుంది. అందువల్లే విరాట్ రావాలి, పరుగులు తీయాలని అభిమానులు కోరుకుంటారు. అభిమానుల అంచనాలను కొన్ని సందర్భాల్లో అందుకోలేకపోయినప్పటికీ.. చాలావరకు వాటిని చేరుకొని సరికొత్తగా కనిపిస్తుంటాడు విరాట్ కోహ్లీ.

ప్రస్తుతం ఐపీఎల్ 19 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ దినదినా ప్రవర్తమానంగా ఎదుగుతూనే ఉంది. ఎంతోమంది ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ.. వారికి ఆర్థిక భరోసాతో పాటు.. రకరకాల సౌకర్యాలు అందిస్తోంది. విరాట్ కోహ్లీ ఐపిఎల్ 19వ ఏట అడుగుపెట్టిన నేపథ్యంలో.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 19 పరుగులు చేశాడు.. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విరాట్ కోహ్లీ ఐపిఎల్ 19వ ఏట.. 19 పరుగులు చేయడాన్ని దేవుడు ప్రణాళిక అని చెబుతున్నారు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే లీడింగ్ రన్స్ తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కెరియర్ ప్రకారంగా చూసుకుంటే 2008 నుంచి 2023 వరకు మొత్తం 29 ఇన్నింగ్స్లలో 7263 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. 37.24 యావరేజ్, 130 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. ఇందులో ఏకంగా 234 సిక్సర్లు ఉన్నాయి. సిక్సర్ రేటు 23.9 గా నమోదయింది. 2024 నుంచి ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 35 ఇన్నింగ్స్ లలో 1,626 పరుగులు చేశాడు. 58.07 యావరేజ్ తో, 151 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. ఇందులో 65 సిక్సర్లు ఉన్నాయి. సిక్సర్ రేటు 16.6 గా కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ.

విరాట్ కోహ్లీ 19 పరుగులు చేయడంతో.. ప్రస్తుతం ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ఇబ్బంది పడింది. సాల్ట్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. సొంత మైదానంలో 200కు నుంచి పరుగులు చేస్తుందనుకుంటే.. చివరికి 175/8 వద్ద తన ఇన్నింగ్స్ ముగించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version