Homeజాతీయ వార్తలుOperation Sindoor 2.0: ఏ క్షణమైనా ఆపరేషన్‌ సిందూర్ 2.0.. సీడీఎస్‌ సంచలన ప్రకటన

Operation Sindoor 2.0: ఏ క్షణమైనా ఆపరేషన్‌ సిందూర్ 2.0.. సీడీఎస్‌ సంచలన ప్రకటన

Operation Sindoor 2.0: గతేడాది ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 26 మందిని చంపేశారు. దీంతో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. కాల్పులు జరిపించి పా‍కిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులే అని నిర్ధారించింది. దీంతో మే 7న భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ప్రతిగా పాకిస్తాన్‌ భారత్‌పై దాడులకు తెగబడింది. ఈ దాడులను భారత వాయుసేన తిప్ప కొట్టడమే కాకుండా పాకిస్తాన్‌లోని ఎయిర్‌ బేస్‌లు, అణు స్థావరాలకు సమీపంలో కచ్చితమైన దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్‌ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికాను బతిమిలాడీ సీడీఎస్‌ స్థాయిలో సంప్రదింపుల తర్వాత భారత్‌ దాడులు నిలిపివేసింది. పాకిస్తాన్‌ తోక జాడిస్తే ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. తాజాగా భారత త్రివిధ దళాలు సిందూర్‌ 2.0కు పూర్తి సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రకటించారు. సైనిక సవాళ్లను ఎదుర్కొనేందుకు దళాల సమన్వయం, ఇంటెలిజెన్స్ బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఆపరేషన్‌ సిందరూర్‌కు ఏడాది..
ఆపరేషన్ సిందూర్ మొదటి దశ పాకిస్తాన్ మీద రహస్య దాడుల ద్వారా విజయవంతమైంది. లక్ష్యాలపై కచ్చితమైన దాడి, డ్రోన్ రక్షణ, ఎయిర్ బేస్‌ల ధ్వంసం వంటి విజయాలు సాధించింది. తాజాగా చౌహాన్ మాటలు పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలకు ప్రతిగా చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీ ఇంటెలిజెన్స్ సేకరణపై ప్రధాన దృష్టి పెట్టాలని సూచించారు. నావికాదళం, వాయుసేనల సమన్వయం మెరుగుపడాలని నొక్కి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ వంటి సంస్కరణలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలు..
పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల తర్వాత రహస్య చర్యలు, డ్రోన్ దాడులు, సీపీఈసీ రహస్య ప్రాజెక్టులపై దాడులు సంభవించాయి. తర్వాత పాకిస్తాన్‌ తామే గెలిచినట్లు ప్రచారం చేసుకుంది. కానీ తర్వాత పాక్‌ రక్షణ మంత్రి తమ ఎయిర్‌ బేస్‌లు దెబ్బతిన్నట్లు అంగీకరించాడు. భారత్‌ దాడుల్లో చనిపోయిన సైనికులకు స్వతంత్ర దినోత్సవం రోజు అవార్డులు ప్రకటించారు. దీంతో ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బ పాకిస్తాన్‌కు గట్టిగానే తాకింది. తీవ్రంగా ఆస్తినష్టం కలిగింది. అయినా తన వంకర బుద్ధి మార్చుకోని పాకిస్తాన్‌ తరచూ కవ్విస్తోంది. ఈ నేపథ‍్యంలో చైనా-పాక్ అలయన్స్, బెల్ట్ యాండ్ రోడ్ ఇనిషియేటివ్‌పై భారత దృష్టి పెట్టింది.

ఇంటెల్ బలోపేతం, సమన్వయ ఆపరేషన్స్, ఏఐ ఆధారిత యుద్ధ వ్యూహాలు, సైబర్ డిఫెన్స్, పొరుగు గస్తీలు, హై అలర్ట్‌తో భారత త్రివిధ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ 2.0కు సన్నద్ధం చేస్తున్నారు. మొదటి దశ విజయవంతమైన నేపథ్యంలో మిగతా దశల్లో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version