Maida powder: సాధారణంగా మనం పప్పు ధాన్యాలను మిల్లుకు వేస్తే మనకు పిండి వస్తుంది. ఈ క్రమంలోనే జొన్నలను మిల్లు పడితే జొన్నపిండి, సెనగలు నుంచి శెనగపిండిని పొందుతాము. అలాగే గోధుమల నుంచి గోధుమపిండిని పొందుతాము మరి మైదాపిండి ఏ విధంగా తయారవుతుంది? అనే సందేహం ప్రతి ఒక్కరికీ వచ్చి ఉంటుంది. అసలు మైదా పిండిని ఏవిధంగా తయారు చేస్తారు? మైదాపిండి అంత తెల్లగా, జిగురుగా ఉండటానికి గల కారణం ఏమిటి అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి. మరి మైదాపిండి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పిండి అంత మెత్తగా తెల్లగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….
గోధుమల నుంచి గోధుమపిండి వచ్చిన విధంగానే గోధుమల నుంచి మైదాపిండిని కూడా తయారుచేస్తారు. అయితే మైదా పిండి మిల్లులో ఎక్కువగా ఫాలిష్ చేయడం వల్ల మనకు తెలుపు రంగులో వస్తుంది. అంతేకాకుండా మైదాపిండి తయారు చేసేటప్పుడు
అజో బై కార్బొనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలను అధిక మొత్తంలో ఉపయోగించి శుభ్రపరచడం వల్ల మనకు మైదాపిండి తెలుపు రంగులో కనబడుతుంది.
ఈ రసాయనాలతో పాటు అల్లొక్సన్ అనే రసాయనాన్ని కూడా వినియోగిస్తారు. అయితే ఇలా మైదాపిండి తయారీలో భాగంగా ఈ రసాయనాలను ఉపయోగించడం చైనా, ఐరోపా దేశాలతో పాటు ఎన్నో దేశాలు మైదాపిండిని పూర్తిగా నిషేధించాయి. కానీ మన భారతదేశంలో మాత్రం మైదాపిండి వినియోగం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇలా రసాయనాలను ఉపయోగించటం వల్ల మైదాపిండి తెలుపు రంగులో ఉండడమే కాకుండా జిగురుగా కూడా ఉంటుంది అందుకోసమే మైదాపిండిని హోమ్ మేడ్ గమ్ అని కూడా పిలుస్తారు. ఇలా మైదా పిండికి హత్తుకొనే స్వభావం ఉంది కనుక వీటిని ఎక్కువగా తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయని ఈ పిండి మొత్తం మన పొట్టలో పేరుకుపోవడం వల్ల అధిక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.