Bheemla Nayak Mogulayya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి చిత్రం “భీమ్లా నాయక్”. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్ లో ట్రైలర్ పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాలపై అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేశారు.
ఇప్పటికి ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. శభాస్ భీమ్లా నాయక్ అంటూ సాగే ఈ పాటను పాడిన మొగిలయ్య వాయిస్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ మొగిలయ్య ఎవరు ఏంటి అనే విషయం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ పాటను మొగిలయ్యతో పాటు రామ్ అనే వ్యక్తి కూడా పాడారు. కానీ ఈ పాటతో మొగిలయ్య ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ మొగిలయ్య ఎవరు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయానికి వస్తే…
మొగిలయ్య నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల ప్రాంతంలో జన్మించారు. ఇతను ఏడు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు. ఈ వాయిద్యాన్ని మొగిలయ్య తన తాత తండ్రుల నుంచి వారసత్వంగా తీసుకున్నారు. 7 మెట్ల కిన్నెర వాయిద్యం కాస్తా 12 మెట్లుగా తీర్చిదిద్దారు మొగులయ్య. ఎంతో ప్రసిద్ధి చెందిన జానపద కళలలో కిన్నెర మెట్ల ఎంతో ప్రసిద్ధి చెందినదని చెప్పవచ్చు. ఈ వాయిద్యంతో ఎన్నో ప్రదర్శనలు చేసిన మొగిలయ్య ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇతని ప్రదర్శన చూసిన తెలంగాణ ప్రభుత్వం అతనికి సన్మానం చేసింది. అదేవిధంగా ఇతని జీవిత కథను తెలంగాణ 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో కూడా చేర్చారు.
ఇలా మొగిలయ్య కిన్నెర మెట్ల ప్రదర్శనను ఇతరులకు నేర్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని ఒక అద్భుతమైన కళ అంతరించిపోతుందని ఈ కళను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలంటూ వేడుకున్నారు. ఇలా కిన్నెర మెట్ల వాయిద్యంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య పై పవన్ కళ్యాణ్ దృష్టి పడింది. ఈ క్రమంలోనే అతనిని పిలిపించి భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ లో ఇతని గొంతును వినిపించారు.ఇలా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో కిన్నెర మెట్లను వాయిస్తూ మొగిలయ్య పాడిన ఈ పాట తెలంగాణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే ఈ పాటను విడుదల చేసిన కొన్ని గంటలకే కొన్ని మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధించుకొని అద్భుతమైన రికార్డును సృష్టించిందని చెప్పవచ్చు.