TSLPRB Recruitment 2021: తెలంగాణ పోలీస్ శాఖలో 151 జాబ్స్.. మంచి వేతనంతో..?

TSLPRB Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 151 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలు మల్టీ జోన్ పోస్టులు కాగా రాత పరీక్ష […]

Written By: Kusuma Aggunna, Updated On : August 24, 2021 11:14 am
Follow us on

TSLPRB Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 151 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలు మల్టీ జోన్ పోస్టులు కాగా రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

https://www.tslprb.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 151 ఉద్యోగ ఖాళీలలో మల్టీ జోన్-1లో 68 ఉద్యోగ ఖాళీలు ఉండగా మల్టీ జోన్‌-2లో 83 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ చదివి సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఇంటర్ చదివిన తర్వాత ఐదు సంవత్సరాలు లా కోర్సు చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా క్రిమినల్ కోర్టులో కనీసం 3 సంవత్సరాలు అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేసి ఉండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2021 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు మంచి వేతనం పొందవచ్చు. మొదటి పేపర్ లో 200 బహుళైచ్చిక ప్రశ్నలు ఉండగా రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఉద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.