Habits : ఇలాంటి అలవాట్లను వదిలేస్తేనే.. జీవితం మారుతుంది

ఉప్పులో సోడియం ఉంటుందని.. దీనిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపితేనే నమ్మాలని చిరాగ్ బర్జాత్యా అంటున్నారు.

Written By: NARESH, Updated On : August 24, 2024 10:40 pm

habits

Follow us on

Habits : సాధించాలని తపన ఉంటే ఎంతటి కష్టమైన దానిని కూడా సాధించవచ్చు. కానీ కొంతమంది అలవాట్ల వల్ల వాళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మన అలవాట్లే మన విజయానికి పునాది. మంచి అలవాట్లు ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించవచ్చని రచయిత ర్యాన్ హాలిడే అంటున్నారు. ఉదయం పూట లేటుగా నిద్ర లేవడం మానుకోవాలి. ఎంత లేటుగా పడుకున్న తొందరగానే లేవడం మంచిది. అలాగే మీ చేతిలో లేని విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం చేయకూడదు. వ్యతిరేక ఆలోచనలు ఉన్నవారితో మీరు కలిసి ఉండటం, నో చెప్పడం తెలియకపోవడం, జీవతాంతం బ్రతికి ఉండమని ఆలోచన నుంచి బయటకు రావాలి. ఈ అలవాట్లను వదిలేస్తే మీ జీవితం ఉన్నతంగా ఉంటుందని రచయిత ర్యాన్ హాలిడే అంటున్నారు.

ఒకే ప్లేస్‌లో ఎక్కువసేపు కూర్చోవడం అనర్థదాయకం
మద్యం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమం అనే విషయం తెలిసిందే. అయితే ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం కూడా అనర్థదాయకమని ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్ ఇగోర్ బూనెవిచి అంటున్నారు. సాధారణంగా చాలామంది ఇంట్లో, బయట లేదా ఆఫీస్‌లో ఒకే చోట కూర్చుని ఉంటారు. ఇలా కూర్చోని ఉండటం అంత మంచిది కాదట. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, అకాల మరణం వంటి సమస్యలు వస్తాయట. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే చోట కూర్చోని ఉండకుండా అటు ఇటు నడవడం మంచిదని ఇగోర్ బూనెవిచి అంటున్నారు.

నైపుణ్యాలు ఎంత బెస్ట్‌గా ఉంటేనే సంపాదన పెరుగుతుంది
నాకు చాలా అనుభవం ఉంది. కానీ సంపాదన తక్కువగా ఉంటుందని ఏంటని భావిస్తారు. అయితే నైపుణ్యాలు ఎంత మెరుగుపడితే సంపాదన పెరుగుతుందని వ్యాపారవేత్త కునాల్ షా అంటున్నారు. జీవితంలో వచ్చే అన్ని కష్టాలను ఎదుర్కొని నైపుణ్యాలు నేర్చుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారని అంటున్నారు. మెదడుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే సంపాదనతో పాటు స్థాయి కూడా పెరుగుతుందని కునాల్ షా అంటున్నారు.

అందరిని నిందించవద్దు
ప్రస్తుతమున్న సమాజంలో అవినీతి పెరిగిపోయింది. అయితే ఇప్పటి అవినీతికి 1950లు, 1960లో ఉన్న వాళ్లను కొందరు నిందిస్తున్నారు. అయితే ఇప్పటి అవినీతికి అప్పటి వాళ్లను నిందించడం కరెక్ట్ కాదని ఆర్థికవేత్త కౌశిక బసు అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో వాళ్లు ఎంచుకున్న వాళ్లను, వ్యవస్థలను తప్పుపడుతున్నారు. అలా నిందించుకుంటూ పోతే ఎంతో మందిని నిందించాల్సి వస్తుందని కౌశిక్ బసు అంటున్నారు. మరి ఈ విషయంలో మీరేం అంటారు.

సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దు
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఉప్పు అధికంగా తీసుకున్న పర్లేదు.. దాని వల్ల రక్తపోటు పెరగదని వీడియో నెట్టింట బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇలాంటి వీడియోలు చాలా ప్రమాదకరమని ఫిట్‌నెస్ కోచ్ చిరాగ్ బర్జాత్యా అంటున్నారు. ఉప్పులో సోడియం ఉంటుందని.. దీనిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపితేనే నమ్మాలని చిరాగ్ బర్జాత్యా అంటున్నారు.