Curd : పుల్లటి పెరుగు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

పెరుగులోని ప్రోటీన్స్ అతిగా తినడాన్ని కూడా తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి బరువు కూడా పెరగరు. ఇక ఇందులోని కాల్షియం తలనొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి.

Written By: Swathi, Updated On : August 24, 2024 10:45 pm
Follow us on

curd : పెరుగు ఎంతో మందికి చాలా ఇష్టం. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత కూడా చాలా మంది కచ్చితంగా కాస్తైన పెరుగు అన్నం తినాలి అనుకుంటారు. ఒక రెండు ముద్దల పెరుగు అన్నం తింటే గానీ కడుపు నిండిన ఫీల్ రాదు కదా. ఇలా చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే పెరుగు తియ్యగా ఉంటేనే బాగుంటుంది. కానీ కొందరు పుల్లగా ఉన్నా సరే ఇష్టపడతారు. మరి మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇది పక్కన పెడితే పుల్లటి పెరుగు తినవచ్చా? లేదా? ఈ పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతాయా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయట. అయితే ఓ సారి క్లారిటీ తెచ్చేసుకుందాం.

భారతీయ ఆహారంలో పుల్లని పెరుగు ప్రాముఖ్యత ఎక్కువ. అయితే ఇందులో ప్రోబయోటిక్స్, కాల్షియం ప్రోటీన్ అధికంగా ఉండే సోర్ పెరుగుతో అంటే పుల్లని పెరుగుతో కొలెస్ట్రాల్‌కు సంబంధం ఏమిటి? అనే అనుమానం మీలో వచ్చి ఉంటుంది. అది తెలుసుకుందాం. హార్మోన్లు, విటమిన్ డి, జీర్ణ ఆమ్లాల ఉత్పత్తిలో ప్రయోజనకరమైన కొలెస్ట్రాల్ HDLని మంచి కొలెస్ట్రాల్ అంటారు. LDLని చెడు కొలెస్ట్రాల్ అంటారు అనే విషయం తెలిసిందే. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, శరీరంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.
పుల్లటి పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు , ప్రోబయోటిక్స్ లు లభిస్తాయి. కానీ అన్ని రకాల పెరుగులు సమానమైన ప్రయోజనం చేకూర్చవట. పెరుగు పోషక నాణ్యత అది తయారు చేసిన పాల రకాన్ని బట్టి ఉంటుంది అంటున్నారు నిపుణులు. మొత్తం పాలు, తక్కువ కొవ్వు, కొవ్వు లేనివి, పూర్తి కొవ్వు – పెరుగు నాణ్యత వివిధ పాలల ఉత్పత్తుల మీద ఇది ఆధారపడి ఉంటుంది. పుల్లని పెరుగు కూడా పోషక విలువను కూడా నిర్ణయిస్తుంది.

తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలతో తయారు చేసిన పుల్లని పెరుగు కొలెస్ట్రాల్‌ను పెంచదట. పూర్తి కొవ్వు పాల నుంచి పెరుగును కరిగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు కొంచెం మాత్రమే ఉంటాయని తెలుపుతున్నాయి అధ్యయనాలు. పుల్లటి పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఈ ప్రోబయోటిక్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. పుల్లని పెరుగులోని ప్రోబయోటిక్స్ కొలెస్ట్రాల్‌ను కనీసం 4-5 శాతం తగ్గిస్తాయి అంటున్నారు బ్రిటీష్ పరిశోధకులు. కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు ఉన్నవారు తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలతో తయారు చేసిన పెరుగు తినడం వల్ల ఫలితాలు ఉంటాయి. మీరు ప్రోబయోటిక్ పెరుగు కూడా తినవచ్చు. అయితే మీరు ఎలాంటి పెరుగు తిన్నా అందులో పంచదారను మాత్రం అసలు యాడ్ చేయవద్దు.

ఇక పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి గుండెకు మంచిది. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులోని కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులోని ప్రోటీన్స్ అతిగా తినడాన్ని కూడా తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి బరువు కూడా పెరగరు. ఇక ఇందులోని కాల్షియం తలనొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి.