Dink couples : ఇంతకు ముందు తరాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి మెలసి సంతోషంగా ఉండేవారు. ఏదైనా కుటుంబ సభ్యులతో పంచుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం అంతా మారిపోయింది. కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నారు. పెళ్లయిన వెంటనే చిన్న కుటుంబంగా మారిపోతున్నారు. ఇందులో కేవలం భార్య, భర్త మాత్రమే ఉంటున్నారు. ఉద్యోగరీత్యా ఎక్కడో తప్పక ఉండటం వేరు. కానీ కావాలనే చిన్న కుటుంబంగా మారడం వేరు. ఇలా చాలామంది కుటుంబానికి దూరంగా దంపతులు మాత్రమే ఉంటున్నారు. అందరికీ దూరంగా, ఎవరూ లేకుండా ఒంటరిగా బ్రతకుతన్నరు. అయితే ప్రస్తుతం దీనికి అడ్వాన్స్‌డ్‌గా ఉండే కల్చర్ వచ్చింది. అదే డింక్ కల్చర్. ఇంతకీ డింక్ కల్చర్ అంటే ఏమిటి? పూర్తి స్టోరీ తెలుసుకుందాం.
డింక్(DINK) అంటే డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ అని అర్థం. ప్రస్తుతం భారత్‌లో డింక్ జంటలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే సంపాదన ఎక్కువగానే కావాలి. కానీ పిల్లలు మాత్రం లైఫ్‌లో వద్దనే కాన్సెప్ట్‌నే డింక్ అంటారు. విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ కల్చర్ ఇప్పుడు భారతదేశంలో కూడా పెరిగింది. జంటలు వాళ్ల వ్యక్తిగత విషయాలు లేదా ప్రైవసీ కోసం పిల్లలను కనకూడదని అనుకుంటున్నారు. డబ్బులు బాగా సంపాదిస్తే చాలు. లైఫ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా పిల్లలేందుకు అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉంటున్నారు. డబ్బు ఉంటే నచ్చిన ఫుడ్ తినవచ్చు. నచ్చినట్లు ఉండవచ్చు. ఎక్కడికైనా వెళ్లవచ్చు అనే డైనమాలో డింక్ లైఫ్‌స్టైల్ కావాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ డింక్ కాన్సెప్ట్ 1980 నుంచి ఉంది. కానీ ఇటీవల మనదేశంలో ఎక్కువ మంది పాటిస్తున్నారు. అయితే ఈ లైఫ్ చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి పిల్లలను కనకూడదని భావిస్తున్నారు. కానీ దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వయస్సులో ఉన్నప్పుడు పిల్లలకి మన అవసరం ఉంటుంది. వాళ్ల అవసరం మనకి ఉండదు. కానీ వృద్దాప్యంలో మనకి చూసుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉండాలి. లేకపోతే ఆ జీవితం చాలా నరకంగా ఉంటుంది. ఈ లైఫ్‌స్టైల్ వల్ల పిల్లలు ఉండరు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చాలా మంది భావిస్తారు. కానీ అందరూ ఈ లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడితే జనాభా తగ్గుతుంది. కుటుంబ సంతానోత్పత్తి ఉండదు. మీతోనే ఆగిపోతుంది. మనిషి పుట్టడం, జీవించడం, పిల్లలను కనడం, మళ్లీ చనిపోవడం అనేది ప్రకృతి సృష్టించినది. పూర్తిగా ఈ కల్చర్‌కి అలవాటు అయితే బంధాలు, బంధుత్వాలు ఉండవు. ఏదో ఒక వీక్ మూమెంట్‌లో అనిపిస్తుంది. మన బాధలు చెప్పుకోవడానికి మన పిల్లలు, మనకి ఓ కుటుంబం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. మరి ఈ డింక్ కల్చర్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.