Mouthwash: పదిమందిని ఆకర్షించాలంటే మంచి ఔట్ ఫిట్, టాకింగ్ పవర్, అందం, అందానికి తగిన స్మైల్ కూడా ఉండాల్సిందే. అయితే నలుగురిలో నవ్వుతుంటే మీ పసపు దంతాలు కనిపిస్తే, లేదంటే నోటి నుంచి దుర్వాసన వచ్చినా సరే కాన్ఫిడెంట్ గా ఉండలేరు. ఎదుటి వారు ఇబ్బంది పడుతారని, ఎగతాళి చేస్తారని, లేదంటే చులకన అవుతారని వారి ముందు మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. మౌత్ వాష్ తో ఈ దుర్వాసన సమస్యను దూరం చేయవచ్చు. కానీ సమయానికి మౌత్ వాష్ లేకపోతే…అందుకే ఈ టిప్ప్ పాటించండి.
మీ రోజు ప్రారంభం అవుతున్న సమయంలో గోరువెచ్చని నీటితో కొంత నిమ్మరసం కలిపి తాగండి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గడం, దుర్వాసనను తొలగించడం మాత్రమే కాదు ఎన్నో వ్యాధుల నుంచి దూరం చేస్తుంది ఈ నిమ్మ నీళ్లు. నిమ్మరసాన్ని మౌత్ వాష్ గా యూజ్ చేయవచ్చు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది నిమ్మరసం,
ఎక్కడికి వెళ్లినా టంగ్ క్లీనర్, మౌత్ వాష్, బ్రష్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో వీటిని తీసుకొని వెళ్లడం కుదరదు కాబట్టి చూయింగ్ గమ్ తినడం బెటర్. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదని గుర్తుపెట్టుకోండి. చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించండి. ఈ చూయింగ్ గమ్ బదులు నిమ్మరసం బెస్ట్ ఆప్షన్. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటంతో చిగుళ్ల వాపు,దంతాలు క్లీన్ అవుతాయి కూడా.
నిమ్మరసం నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి తోడ్పడుతోంది. నిమ్మరసం మౌత్ వాష్ ని తయారు చేసుకోవడం కూడా సులభమే. ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోండి. ఒక గ్లాసులో నిమ్మకాయను పిండి.. నీటిని నిమ్మరసాన్ని బాగా కలపండి. దీనితో 2-3 సార్లు పుక్కిలించి ఉమ్మండి. నిమ్మరసాన్ని ఎక్కువగా ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఎక్కువ ఉపయోగించడం వల్ల దంత క్షయం లేదా సున్నితత్వం బారిన పడే అవకాశం ఉంది.