Homeజాతీయ వార్తలుIndia Code: ఇండియాకు 91 కోడ్‌ ఎలా వచ్చిందో తెలుసా?

India Code: ఇండియాకు 91 కోడ్‌ ఎలా వచ్చిందో తెలుసా?

India Code: ప్రతీ ఊరికి పిన్‌కోడ్, ప్రతీ ల్యాండ్‌ ఫోన్‌ నంబర్‌కు ఎస్టీడీ కోడ్‌ ఉన్నట్లుగానే ప్రస్తుతం ప్రతీ మొబైల్ నంబర్‌కు ముందు + 91 కోడ్‌ వస్తుంది. దీనిని మనందరం గమనిస్తాం. చాలా మంది ఇండియా కోడ్‌ అని కూడా చెబుతారు. కానీ అది ఎలా వచ్చింది అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పుడు + 91 కోడ్‌ ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

– ఇది మన దేశ కోడ్‌. ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్‌ యూనిట్‌ (ITU) ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇలాంటి కోడ్‌లను కేటాయిస్తుంది.

– ఐటీయూకు చెందిన కన్సల్టేటివ్‌ కమిటీ ప్రపంచాన్ని 9 వేర్వేరు జోన్లుగా విభజించింది. ఈ కోడల్‌ను కేటాయించింది.

– ఏ దేశానికి చెందిన స్థానిక నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నా.. ఆ దేశానికి చెందిన కంట్రీ కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

– జనాభా, ఆర్థిక వ్యవస్థ, కమ్యూనికేషన్‌ సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని యూటీఐ ఈ కోడ్‌లను కేటాయిస్తుంది.

– దక్షిణ, మధ్య, పశ్చిమాసియాతోపాటు మధ్య ప్రాచ్య దేశాలు తొమ్మిదో జోన్‌ పరిధిలోకి వస్తాయి.

– తొమిదో జోన్‌లో ఉన్న అన్ని దేశాల కోడ్‌ 9తోనే ప్రారంభమవుతుంది. ఇండియాకు + 91, పాకిస్తాన్‌కు + 92, ఆఫ్ఘనిస్తాన్‌కు +93 నంబర్లు కేటాయించారు. ఇలా ఇండియాకు +91 కోడ్‌ వచ్చింది.

– ప్రముఖ, అత్యంత జనాభా కలిగిన దేశాలకు తక్కువ డిజిట్‌ కలిగిన కోడ్‌ ఉంటుంది. చిన్న దేశాలకు 3 అంకెల కోడ్‌ ఉంటుంది.

– యూఎస్‌(+1), యూఎస్‌ఎస్‌ఆర్‌(+7)క మాత్రమే సింగిల్‌ డిజిట్‌ కోడ్‌లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌(+880), ఫిజీ(+679), కాంగో వంటి దేశాలకు మూడంకెల కోడ్‌ ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version