Banana: మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాల్లో పండ్లు ముఖ్యమైనవి. రోజువారీ ఆహారంలో పండ్లు చేర్చుకోవడం మంచిది. పండ్ల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవు. అందులో ఉండే ప్రొటీన్లతో మనకు ఎన్నో లాభాలున్నాయి. పండ్లలో అరటిపండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఒక అరటి పండులో దాదాపు వంద కేలరీల శక్తి ఉంటుంది. అరటి పండు తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. ఇందులో అధికంగా ఉండే పొటాషియం వల్ల తల తిరగడం, వాంతులు లేదా పల్స్ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది గుండెపోటుకు కూడా కారణమవుతుంది.
దంతాల్లో..
అరటి పండు తినడం వల్ల దంతాల్లో ఇరుక్కుంటుంది. దీంతో ఇది తిన్న తరువాత రెండు గంటల లోపు దంతాలను శుభ్రం చేసుకోవాలి. అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. పచ్చి అరటిపండులో స్టార్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపులో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచిదే. తక్కువ నీరు ఉండటంతో మలబద్ధకం సమస్య బాధిస్తుంది.
Also Read: BJP- CM KCR: బీజేపీపై పోరులో ఒంటరవుతున్న గులాబీ బాస్!
షుగర్ లెవల్స్ పెంచుతుంది
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే మధుమేహం ఉన్న వారు అరటిపండును తినడం మంచిది కాదు. ఒకవేళ తిన్నా ఒకటి తింటేనే మేలు. ఎక్కువ తినడం వల్ల షుగర్ పెరుగుతుంది. కిడ్నీ సమస్య ఉన్నట్లయితే కూడా అరటిపండును దూరంగా ఉంచుకోవాలి. అరటిపండు తిన్న తరువాత నోటిలో తిమ్మిర్లు, చికాకు, దురద వంటివి అనిపిస్తే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఇలా అరటి పండుతో మనకు లాభాలున్నా నష్టాలు కూడా ఎక్కువే ఉంటున్నాయి.
దంతక్షయం
అరటిపండు ఎక్కువగా తినడం వల్ల దంత క్షయం సమస్య వస్తుంది. దీనిలో పోషకాలు ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తాయి. మెగ్నిషియం, పొటాషియం, మాంగనీసు, ఫైబర్, ప్రొటీన్లు, బి6 , విటమిన్ సి ఇందులో ఉండటంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకావాలను అరటిపండు తగ్గిస్తుంది. పరగడుపున అరటి పండు తినకూడదు. దీంతో కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఉదయం అరటి పండు తినడం అంత మంచిది కాదు.