Grapes Side Effects: పిల్లల నుంచి పెద్దల వరకు ద్రాక్ష పండ్లను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ద్రాక్షపండ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శీతాకాలంలో ద్రాక్ష పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ద్రాక్షపండ్లను పరిమితంగా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో ఎక్కువగా తీసుకోవడం వల్ల అదేస్థాయిలో నష్టాలు ఉంటాయి.
మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు ద్రాక్షపండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. షుగర్ తో బాధ పడేవాళ్లు ద్రాక్షపండ్లను తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు ద్రాక్షపండ్లను తక్కువగా తీసుకుంటే మంచిది. ద్రాక్షపండ్లు ఎక్కువగా తీసుకుంటే అనాఫిలాక్సిస్ సమస్యతో పాటు దురద, దద్దుర్లు మరియు నోటి వాపు సమస్యలకు కారణమవుతుంది.
Also Read: నూతన జిల్లాల ఏర్పాటుతో వైసీపీకి తలనొప్పులేనా?
ద్రాక్ష పండ్లలో ఉండే లిక్విడ్ ప్రోటీన్ ట్రాన్స్‌ఫేరేస్ అలెర్జీ సమస్యలకు కారణమవుతుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తంలో ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులలో అలర్జీ సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. గర్భవతులు అయిన మహిళలు ద్రాక్షపండ్లను తీసుకుంటే మంచిది కాదని చెప్పవచ్చు. ద్రాక్ష పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ వల్ల పుట్టబోయే బిడ్డ ప్యాంక్రియాటిక్ సమస్యలతో బాధపడే ఛాన్స్ అయితే ఉంటుంది.
బరువు తగ్గాలని భావించే వాళ్లు ద్రాక్ష పండ్లకు దూరంగా ఉంటే మంచిది. పైబర్, కాపర్, విటమిన్ కె, థయామిన్, ప్రోటీన్, కొవ్వు ద్రాక్ష పండ్లలో ఉంటాయి. ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు మధుమేహం సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. తరచూ ద్రాక్ష పండ్లను తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: 100 కంపెనీలు.. 50వేల మందికి ఉపాధి.. కేసీఆర్ సెంటిమెంట్ తో కొట్టిన కేటీఆర్