KTR: 100 కంపెనీలు.. 50వేల మందికి ఉపాధి.. కేసీఆర్ సెంటిమెంట్ తో కొట్టిన కేటీఆర్

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన తండ్రి కేసీఆర్ గురించి గొప్పగా చెప్పారు. ఆయన లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని తేల్చిచెప్పారు. కేసీఆర్ కనుక రాజకీయాలు వదిలి ఉంటే ఇప్పుడు తెలంగాణ ఉండేదా? ఈ బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర అధ్యక్షులు అయ్యేవారా? అని సూటిగా ప్రశ్నించారు.  హైదరాబాద్ శివారు కండ్లకోయలో ఐటీ పార్క్ కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా […]

Written By: NARESH, Updated On : February 17, 2022 5:26 pm
Follow us on

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన తండ్రి కేసీఆర్ గురించి గొప్పగా చెప్పారు. ఆయన లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని తేల్చిచెప్పారు. కేసీఆర్ కనుక రాజకీయాలు వదిలి ఉంటే ఇప్పుడు తెలంగాణ ఉండేదా? ఈ బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర అధ్యక్షులు అయ్యేవారా? అని సూటిగా ప్రశ్నించారు.  హైదరాబాద్ శివారు కండ్లకోయలో ఐటీ పార్క్ కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్క్ పనులను మంత్రికేటీఆర్ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే కేటీఆర్ అభివృద్ధి కూడా తెలంగాణ సెంటిమెంట్ తో కొట్టారు. ఇప్పుడు కండ్లకోయలో ఐటీ పార్క్ నిర్మించుకుంటున్నామంటే అది అంతా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఫలితంగానేనని స్పష్టం చేశారు. 100 కంపెనీలు ఇక్కడికి వస్తాయని.. 50వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఉత్తర హైదరాబాద్ లో 35 ఇంజినీరింగ్ కాలేజీలు, 50 డిగ్రీ కాలేజీలు , 30 ఎంబీఏ కాలేజీలతోపాటు పలు ఫార్మసీ, మెడికల్ ,నర్సింగ్ కాలేజీలున్నాయన్నారు.

Also Read: Actor Ali: అలీకి జగన్ ఇవ్వబోతున్న పదవి అదేనట ?

 

ప్రతి ఏడాది 15 నుంచి 20వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్లు అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. వీరంతా పశ్చిమ హైదరాబాద్ కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. ఉత్తర హైదరాబాద్ లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మిస్తున్నామని.. దగ్గరలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు ఉన్నాయని కేటీఆర్ వివరించారు.

Also Read: గౌత‌మ్ స‌వాంగ్‌కు కీల‌క ప‌ద‌వి.. జ‌గ‌న్ అస‌లు వ్యూహం ఇదే..!

మేడ్చల్ జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ కండ్లకోయ తెలంగాణ గేట్ వే పేరుతో ఐటీ పార్క్ ఏర్పాటు చేశారు. దీన్ని ప్రభుత్వం 100 కోట్లతో నిర్మిస్తోంది. మొత్తం 10 ఎకరాల స్థలంలో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఐటీ పార్క్ ఉండనుంది. ఈ ఐటీ పార్క్ లో 100 కంపెనీల ద్వారా 50వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో కాన్ఫరెన్స్ హాల్స్, భారీ పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

ఇక కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఇంతలా అభివృద్ధి చెందేది కాదని.. ఇన్ని కంపెనీలు వచ్చేవి కావని.. ఇదంతా కేసీఆర్ రాష్ట్ర సాధన వల్లే సాధ్యమైందని..  అభివృద్ధిని అంతా కేసీఆర్ వైపు మళ్లించారు.

Also Read: నూత‌న జిల్లాల ఏర్పాటుతో వైసీపీకి త‌ల‌నొప్పులేనా?