Whatsapp: దేశంలోని ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉపయోగించే యాప్ ఏదనే ప్రశ్నకు వాట్సాప్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. వాట్సాప్ చాట్ సీక్రెట్ గా ఉండాలని మనలో చాలామంది కోరుకుంటారు. ఇతరులు మన వాట్సాప్ చాట్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని ఎక్కువమంది భావిస్తారు. ఇప్పటేకే వాట్సాప్ యూజర్ల భద్రత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సిగ్నల్ ప్రోటోకాల్ ఆధారంగా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ పని చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల ఇతరులు వాట్సాప్ చాట్ ను చూడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో మన ఫోన్ పాస్ వర్డ్ లు తెలిసిన వాళ్లు మన వాట్సాప్ లోని చాట్ ను చదివే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే వాట్సాప్ చాట్ లోని విషయాలు ఇతరులకు తెలియకుండా ఉండాలని భావిస్తే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.
Also Read: CM YS Jagan: ఆ కేసులో జగన్‌కు రిలీఫ్.. కానీ ఇదేం తీరు..
ఇతరులు ఫోన్ లోని వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయకూడదని అనుకుంటే యాప్ కు టచ్ ఐడీ లేదా పాస్ వర్డ్ ను పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్ ను ఇతరులు తీసుకున్నా వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. వాట్సాప్ ను కొంతమంది మొబైల్ తో పాటు డెస్క్ టాప్ లో కూడా వాడతారు. ఫోన్ లో అవతలి వ్యక్తుల సెక్యూరిటీ కోడ్ మారితే సదరు వ్యక్తులే మనతో చాట్ చేస్తున్నారో లేదో నిర్ధారించుకుంటే మంచిది.
వాట్సాప్ యాప్ లో టూ స్టెప్ వెరిఫికేషన్ ను యాక్టివ్ గా ఉంచుకుంటే కూడా ఇతరులు మన్ చాట్ ను, ఇతర విషయాలను తెలుసుకోవడం సాధ్యపడదు. వాట్సాప్ యాప్ ను ఎక్కువగా వాడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Siva karthikeyan: ప్రముఖ నిర్మాత పై కేసు పెట్టిన స్టార్ హీరో.. కారణం అదే