
మహిళలు, అమ్మాయిలను ఎక్కువగా మొటిమల సమస్య వేధిస్తూ ఉంటుంది. ఆయిల్ ముఖం ఉన్నవాళ్లు ఎక్కువగా మొటిమల సమస్యతో బాధ పడుతూ ఉంటారు. కొంతమంది మొటిమలకు చెక్ పెట్టేందుకు క్రీములు లేదా ఆయింట్ మెంట్ లను ఉపయోగిస్తారు. అయితే క్రీములు లేదా ఆయింట్ మెంట్ లను ఉపయోగిస్తే దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మొటిమల సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఆవాలు మొటిమలు మరియు మచ్చలను సులభంగా తగ్గించడంలో తోడ్పడతాయి. ఆవాలలో సాలిసిలిక్ యాసిడ్స్ అనే నేచురల్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది. మొటిమలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. 1/4 మస్టర్డ్ పౌడర్ లో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
పావుగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ టీ ఆకులను నీటిలో లో వేసి మరిగించి ఆ తరువాత వాటిని ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్ లో పెట్టాలి. ఆ తర్వాత గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తో మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంలో మర్ధన చేయాల్సి ఉంటుంది. టమటా రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా కూడా మొటిమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. మొటిమలకు వెల్లుల్లి రెబ్బల రసాన్ని అప్లై చేస్తే మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఎగ్ వైట్ ను సపరేట్ గా తీసుకుని మొటిమలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, క్లే అండ్ ఆయిల్స్ మొటిమల సమస్యను తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి.