Kidney Stones: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మనలో చాలామంది పాలకూరను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు పాలకూరకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇప్పటికే బాధ పడుతున్నవాళ్లు పాలకూరను తింటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వాళ్లు టొమాటోతో వండిన వంటకాలకు సైతం దూరంగా ఉండాలి. టొమాటోలో ఉండే ఆక్సిలేట్ కిడ్నీలోని రాళ్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవాళ్లు చాక్లెట్లకు కూడా దూరంగా ఉండాలి. చాక్లెట్లలో ఉండే ఆక్సలేట్ వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుందని గుర్తుంచుకోవాలి. తరచుగా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మాత్రం యూరిన్ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: పాకిస్తానీ విద్యార్థులను కాపాడిన భారతీయ జెండా
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు సైతం వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. పాలకూర, ఉప్పు, టొమాటోలతో చేసిన వంటకాలను తినడం వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇతర కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: భవిష్యత్ ప్రధాని యోగినే.. బాంబు పేల్చిన అమిత్ షా
కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా సమస్యకు సులభంగా పరిష్కారం లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Recommended Video: