Vasthu Tip For Money: మనిషి జీవన మనుగడ డబ్బు మీదే ఆధారపడింది. అది లేకపోతే, తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, ఉండటానికి ఇళ్లు, అంతెందుకు మరణిస్తే కాటికి వెళ్లాలన్నా ఈ ధనలక్ష్మి ఉండాల్సిందే. అయితే, కొంత మంది ఎంతో కష్టపడుతుంటారు.
ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా నిలబడదు. వచ్చింది.. వచ్చినట్లే ఖర్చైపోతుంది. ఒకటో తారీఖు వచ్చిన సాలరీ.. వారం తిరక్కుండానే మాయమైపోతుంది. ఇలాంటి సమయంలోనే అసలు ఇలా ఎందుకు నాకే జరుగుతుంది?.. అసలు నా జాతకమే ఇలా రాసిపెట్టిందేమో?.. పెదవాడిగానే నేను చచ్చిపోవాలా?.. అని బాధపడుతుంటారు.
అయితే, ఇలా జరగడానికి వెనక చాలా రీజన్స్యే ఉన్నాయి. కేవలం మీ కష్టం మాత్రం ఉంటే సరిపోదు. మంచి మనసు కూడా ఉండాలి. వీటితో పాటు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, ప్రకారం మీలో ఉన్న కొన్ని చెడు అలవాట్లు మిమ్మల్ని ఆ స్థితికిి చేరుస్తాయి. ఈ క్రమంలోనే ఆ శాస్త్రాల ఆధారంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
వాస్తు శాస్త్రంలో పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. మనసు ఆరోగ్యంగా ఉంటుందట. అలాగే ఇళ్లు శుభ్రంగా ఉంటేనే.. అక్కడ లక్ష్మి నివాసముంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈశాన్య దిశలో శుభ్రత లోపిస్తే.. మీకు అస్సలు మంచిది కాదట. చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి.. దాన్ని లక్ష్మి దేవికి చిహ్నంగా చూస్తారని అంటారు.
ఇక డబ్బు, నగలు ఉంటే అల్మారకు దగ్గరగా చీపురును అసలు ఉంచకూడదట. అదే మీ ఇంట్లో డబ్బు నిలబడటంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. వీటితో పాటు, ఇంట్లో ఉన్న పెద్దవారికి గౌరవం ఇస్తూ ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిచిన్నదానికి ఆవేశపడి అరవడం, అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం, అతిగా నిద్రపోవడం, కూడా ఇంట్లో నెగిటివిటీ పెరగడానికి ప్రధాన కారణాలు. ఇవి కూడా మీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
ఇక ఇంట్లో ఆగ్నేయ దిశలో డబ్బు అసలు ఉంచకూడదని అంటున్నారు. చాలా మంచి కప్‌బోర్డులో తాళం చెవిని తీసుకెళ్లి పెడుతుంటారు. అలా చేయడం వల్ల కూడా ధన నష్టం కలుగుతుంది. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూనే.. మనసును కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు.. అప్పుడే మీ ఇంట్లో ధనలక్ష్మి అడుగుపెడుతుంది.