shells : గవ్వలను ఇంట్లో ఉంచుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..

చాలా మంది లైఫ్ లో ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఎన్ని కష్టాలు పడినా సరే కొందరు దృంఢంగా ఉంటే మరికొందరు మాత్రం ఢీలా పడుతుంటారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్ట్రాంగ్ ఉండటం వల్ల ఎలాంటి కష్టాన్ని అయినా సరే తరిమికొట్టవచ్చు. అయితే లైఫ్ లో సంతోషాలు, బాధలు రావడం పోవడం కామన్ గా జరుగుతుంటాయి. కానీ వచ్చిన బాధలు పోకుండా ఎక్కువ కాలం ఉంటే మాత్రం మానసికంగా కుంగిపోతాం. అయితే.. అలాంటి సమయంలో ఆ బాధల నుంచి బయటపడాలి అనే విషయాలకు కొన్ని సార్లు జోతిష్యశాస్త్రంలో చాలా రెమిడీలు ఉంటాయి. కొన్నింటిని ఫాలో అవ్వడం వల్ల చాలా రకాల సమస్యలను తొలగించవచ్చు అంటున్నారు పండితులు. కేవలం గవ్వలతో కూడా కష్టాలను తొలగించుకోవచ్చట. అవును నిజమే. ఇది సాధ్యం అవుతుందట. అదెలాగో నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : October 30, 2024 1:13 pm

Keeping shells at home? Know this..

Follow us on

shells : మీరు నెలలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఐదు గవ్వలను తెచ్చుకోవాలి. వాటిని ఇంట్లో పూజ గదిలోని లక్ష్మీదేవి వద్ద ఉంచి ఆ లక్ష్మీదేవిని పూజించాలి. అలా పూజించిన తర్వాత  ఆ గవ్వలను శుభ్రం చేయాలి. ఆ తర్వాత వాటిని ఏదైనా ఎరుపు రంగు వస్త్రంలో ఉంచాలి. ఇక వీటిని మీరు డబ్బులు దాచుకునే దగ్గర ఉంచడం వల్ల మంచి జరుగుతుంది.  అంతేకాదు  గుప్పెడు గవ్వలు తీసుకొని.. వాటిని మీ ఇంట్లోని లాకర్ లో ముఖ్యంగా, డబ్బులు, బంగారం దాచుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఉండదు అంటున్నారు పండితులు. సంపద పెరుగుతూనే ఉంటుందట.

మీ ఖర్చులు తగ్గాలి.. సంపాదన పెరగాలి అనుకుంటే కూడా తాము రోజూ క్యారీ చేసే పర్సులో  గవ్వలను ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా.. మీ ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజ చేసి.. ఆ తర్వాత పర్సులో పెట్టుకోవాలి అంటున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది.

మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా అయితే..ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో గవ్వలను తీసుకొని వెళ్లండి. దేవుడి దగ్గర పూజ కోసం ఉంచిన గవ్వను తీసుకొని దానిని మీ పర్సులో ఉంచుకొని మరీ ఇంటర్వ్యూకి వెళ్లండి. ఇలా చేయడం వల్ల.. ఇంటర్వ్యూ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అంటున్నారు పండితులు. మీరు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నా సరే ఇంటికి ఫౌండేషన్ వేసే సమయంలో ఈ గవ్వలను కూడా వేయాలి. అది కూడా లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజ చేసిన తర్వాత ఇంటి పునాది రాళ్ల వద్ద వేయాలి అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. ఇంట్లో అంతా మంచే జరుగుతుంది.