Cleanliness : ఇది శరీర శక్తిని చూపిస్తుంది. ఇది తిన్నది సాఫీగా జీర్ణం అవడానికి, ఆహారం నుంచి పోషణను గ్రహించడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ అలవాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కూడా. ధార్మిక, సాంస్కృతిక కోణంలో చూసుకున్నట్లైతే తనడానికి ముందు కాళ్లను, చేతులను, ముఖాన్ని కడుక్కోవడం అంటే భక్తిశ్రద్ధలతో ఆహారాన్ని తీసుకోవడం అంటారు నిపుణులు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయంగా కూడా భావిస్తుంటారు. ఈ అలవాటు ఆరోగ్యం గురించి ఎంతో అవగాహనను కలిగించడంలో సహాయం చేస్తుంది.
కూల్ లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చేతులు, కాళ్లపై నీళ్లు పోస్తే కాస్త అవి చల్లగా అవుతాయి. దీని వల్ల శరీరం దాని ప్రధాన ఉష్ణోగ్రతను ఉదరంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. అందుకే కాళ్లను, చేతులను, ముఖాన్ని చల్లగా చేస్తే జీర్ణక్రియ మంటను పెంచుతుంది. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. తినడానికి ముందు కాళ్లను, చేతులను కడగడం వల్ల చేతులకు, కాళ్లకు ఉన్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాలు తొలగిపోయి ఎలాంటి ఆహారం తిన్నా సరే నష్టం ఉండదు.
అయితే రోజంతా అటూ ఇటూ తిరగడం వల్ల మన ముఖానికి, కాళ్లకు, చేతులకు ఎన్నో రకాల బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి పట్టుకుంటాయి. అందుకే శుభ్రం చేసుకోకుండా తింటే ఇవి మన నోట్లోకి వెళ్తాయి. తద్వారా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అందుకే తినడానికి ముందు పరిశుభ్రతను పాటించాలి. ఇలా తినడానికి ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడం పరిశుభ్రతకు మాత్రమే కాదని ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంటున్నారు నిపుణులు. ఇక కూల్ వాటర్ తో చేతులను, కాళ్లను, ముఖాన్ని కడుక్కోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత ప్రభావితం అవుతుంది.
జీర్ణ మంట మనం తిన్నదాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అలాగే మంచి పోషణను అందించడానికి సహాయం చేస్తుంది. ఇక ఈ అలవాటు వల్ల మనసుకు ప్రశాంతతను వస్తుంది. స్వచ్ఛమైన మనస్సు, శరీరంతో తింటే భావోద్వేగ, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.