తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలను సాగు చేస్తారనే సంగతి తెలిసిందే. ఎరుపు రంగు పుచ్చకాయలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేసవి కాలంలో దాహం తీర్చే పుచ్చకాయలకు ఎంతో డిమాండ్ నెలకొంది. అయితే ఎరుపు రంగు పుచ్చకాయలతో పోలిస్తే పసుపు రంగు పుచ్చకాయలను తింటే ఎంతో మంచిదని చెప్పవచ్చు.
Also Read: డీహైడ్రేషన్ తో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే చిట్కాలివే..?
పసుపు పుచ్చకాయలలో ఏకంగా 95 శాతం వరకు నీరు ఉంటుంది. బెంగళూరు శివారు ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పసుపురంగులో ఉండే పుచ్చకాయలను పండిస్తారు. పసుపు రంగులో ఉండే పుచ్చకాయల్లో గింజలు తక్కువగా ఉండటంతో పాటు రుచి ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం వల్లే ఈ పుచ్చకాయలను డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది.
Also Read: ఉదయం మొలకెత్తిన గింజలు తింటే కలిగే లాభాలివే..?
చాలామంది కస్టమర్లు తమకు ఎరుపు రంగులో కనిపించే పుచ్చకాయలే కావాలని పసుపు రంగులో కనిపించే పుచ్చకాయలు వద్దని చెబుతూ ఉంటారు. కానీ ఎల్లో పుచ్చకాయలను తింటే మాత్రం వీటినే కావాలని అనుకుంటారు. ఎరుపు రంగు పుచ్చకాయలతో పోలిస్తే వీటి ధర కూడా తక్కువే కావడం గమనార్హం. సలాడ్, జ్యూస్ కు ఈ పుచ్చకాయలు బెస్ట్ అని చెప్పవచ్చు. రోజురోజుకు ఎల్లో పుచ్చకాయలకు డిమాండ్ పెరుగుతోంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ఎండ నుంచి ఉపశమనం కోసం ఈ పుచ్చకాయలను తింటే మంచిది. పుచ్చకాయలు తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పుచ్చకాయలపై ఇష్టం ఉన్నవాళ్లు ఈ పుచ్చకాయలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.