Alcohol: రోజంతా కష్టపడ్డామని, కాస్త రిలాక్స్ కావడానికే మద్యం సేవిస్తున్నామని చాలా మంది సాకులు చెబుతూ ఓవర్ గా మద్యం సేవిస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ అమితంగా తాగడం వల్ల జేబు గుల్లవడమే కాకుండా ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే కొన్నాళ్ల పాటు గుండెకు మేలు చేయడానికి రోజుకు రెండు పెగ్గులు తీసుకోవచ్చని కొందరు వైద్యులు తెలిపినట్లు ప్రచారం సాగింది. కానీ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు కాదు కదా..కనీసం ఒక్క పెగ్గు తాగినా హెల్త్ డిసీజెస్ రావడం ఖాయనమని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
మందు లేనిదే ముద్ద దిగదు కొందరు మందుబాబులకు.ఇప్పుడు యువకులు సైతం మద్యం లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మద్యం జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో మెడిసిన్స్ కంటే మద్యానికే విలువ పెరిగింది. మెడిసిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. మద్యం నాశనం చేస్తుంది.. అనే విషయాన్ని చాలా మంది గ్రహించరు. కాస్త మత్తు కోసం కిక్కెక్కించే మద్యాన్ని సేవించడానికి రెడీ అవుతారు. మద్యం సేవించడం వల్ల తాత్కాలికంగా ఆనందం కలిగినా.. శాశ్వతంగా మాత్రం నష్టమేనంటున్నారు.
మద్యం ఎక్కువ తాగకుండా మితంగా తాగితే ఎలాంటి నష్టాలుండవని కొన్ని రోజుల పాటు ప్రచారం సాగింది. ఈ విషయాన్ని వైద్యులే చెబుతున్నారన్న చెప్పుకొచ్చారు. కానీ కొన్ని సంస్థలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం మద్యం ఎంత మోతాదులో తీసుకున్నా ప్రమాదమేనని అంటున్నారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో 19 వేల మందిపై అధ్యయనం చేశారు. మార్కస్ విన్నెటీ అనే అధ్యయనకారుడి అధ్వర్యంలో మద్యాన్ని రోజుకు ఒక్క పెగ్గు తీసుకున్నవారిపై సర్వే చేశారు.
ఈ అధ్యయనం ప్రకారం మద్యం ఫుల్లుగా తాగేవారితో, ఒక్క పెగ్గు తాగేవారిలో పెద్ద తేడా లేదని గ్రహించారు. మద్యం ముట్టని వారితో.. రోజుకు ఒక్క పెగ్గు తాగిన వారిని పోల్చగా భారీ తేడా ఉందన్నారు. అంటే రోజుకు ఎంత తక్కువ మద్యం తాగిన ఆరోగ్యం క్షీణించడం ఖాయమేనని మార్కస్ విన్నెటీ చెబుతున్నారు. ఇక ఒక పెగ్గు మద్యం తాగితే రక్తపోటు ఎక్కువగానే ఉందని తేల్చారు. ఇది ముట్టని వారితో పోలిస్తే ఎక్కువగా ఉందని చెప్పారు.