మనలో చాలామంది జంక్ ఫుడ్ ను ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగా ఉండటంతో పాటు తక్కువ సమయంలో జంక్ ఫుడ్ ను తయారు చేయడం సాధ్యమవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఈ ఫుడ్ పై ఆసక్తి చూపుతున్నారు. జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలేమీ లేకపోయినా బిజీ లైఫ్ వల్ల జంక్ ఫుడ్ తినాల్సిన పరిస్థితి నెలకొంది. జంక్ ఫుడ్ కు అలవాటు పడితే చాలామంది తిండి కూడా తినకుండా ఈ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతారు.
Also Read: గుడ్డు పెంకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
జంక్ ఫుడ్ లో ఎక్కువగా శాచురేటెడ్ కొవ్వులు, సాల్ట్, షుగర్ ఉంటాయి. అయితే వైద్యులు జంక్ ఫుడ్ అస్సలు తినకూడదని 12 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువ మంది జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. జంక్ ఫుడ్ లో ఎటువంటి పోషకాలు ఉండవు. ఈ ఫుడ్ తింటే త్వరగా అలసటకు గురి కావడంతో పాటు బరువు పెరుగుతారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది.
Also Read: రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినే వారికి షాకింగ్ న్యూస్..?
జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో కంటి, వినికిడి సంబంధిత సమస్యలు వస్తాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారిని తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. జంక్ ఫుడ్ శరీరంలో రక్తసరఫరాకు అడ్డు పడి గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. తరచూ జంక్ ఫుడ్ తింటే ఆయుష్షు తగ్గుతుందని.. కొన్నిసార్లు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
జంక్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని.. పిల్లలకు ప్రతిరోజూ తల్లిదండ్రులు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను, .పండ్లను ఇస్తే ఆరోగ్య సమస్యల బారిన పడరని వైద్య నిపుణులు చెబుతున్నారు.