కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రపంచ దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే మాత్రమే కరోనా బారిన పడినా తక్కువ సమయంలో కోలుకునే అవకాశాలు ఉంటాయి. విటమిన్ సి తో కూడిన ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. నిమ్మరసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
Also Read: జంక్ ఫుడ్ తింటున్నారా.. ఆ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..?
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించడంలో నిమ్మరసం సహాయపడుతుంది. అధిక బరువుతో బాధ పడే వారు నిమ్మరసం తాగితే రక్తసరఫరా మెరుగుపడటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మధుమేహంతో బాధ పడే వాళ్లు నిమ్మరసం తాగితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. మన శరీరంలో చేరిన వ్యర్థాలను తొలగించడంలో నిమ్మరసం సహాయపడుతుంది.
Also Read: ప్రతిరోజూ సైకిల్ తొక్కితే ఆ వ్యాధులు దూరమవుతాయట..!
రోజూ నిమ్మరసం తాగితే మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. వయస్సు పెరిగినా ముడతలు పడకుండా చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే నిమ్మరసం తాగితే ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చిన్న చిన్న రాళ్లను కరిగిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే వైద్యులు నిమ్మరసం తాగాలని సూచిస్తూ ఉంటారు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
జీర్ణాశయ సంబంధిత సమస్యలకు సైతం నిమ్మరసం చెక్ పెడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే నిమ్మరసం తాగడం వల్ల చర్మం మిలమిలా మెరుస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం సమస్యలకు చెక్ పెట్టడంతో నిమ్మరసం సహాయపడుతుంది.