Jaggery : ఎలాంటి వంటకం చేసినా సరే పంచదారకు బదులు బెల్లం వేయడం అలావాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేసిన ఆ వంటకు రుచి మరింత ఎక్కువ అవుతుంది. అందుకే భారతీయ వంటకాల్లో ఎక్కువగా బెల్లాన్ని వాడుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఈ బెల్లాన్ని ఆయుర్వేదంలో ఔషధంగా చెబుతుంటారు. ఇక ఈ బెల్లాన్ని నిత్యం తీసుకోవాలి అంటారు నిపుణులు. బెల్లం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు దీనివల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఊపిరితిత్తులతో సహా శ్వాస సమస్యలకు బెల్లం చాలా ఉపయోగపడుతుంది. మరి ఇది నిజంగానే ఈ సమస్యలకు ఎలా చెక్ పెడుతుందో తెలుసుకుందాం.
బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఇది సహజమైన డిటాక్సిఫైయర్ గా పని చేస్తుంది. ఊపిరితిత్తుల నుంచి హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాలను బయటకు పంపుతుంది. ఈ విదంగా శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది బెల్లం. ఊపిరితిత్తుల అల్వియోలీలో చిక్కుకున్న కార్బన్ కణాలను తొలగిస్తుంది. ఈ సామర్థ్యం బెల్లానికి ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కాలుష్యాన్ని కూడా తొలగిస్తుంది.
వాయు కాలుష్యానికి గురైతే ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తుంది బెల్లం. ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతినేలా చేసి వాపును కలిగిస్తుంది. కాబట్టి బెల్లం తినడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ నయం చేయడంలో సహాయం చేస్తుంది బెల్లం. బెల్లంలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి చాలా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా చాలా అవసరం బెల్లం. అంతేకాదు బెల్లం సమర్థవంతమైన ఆక్సిజన్ రవాణాదారుగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కలుషితమైన గాలి కణాలు, రసాయన కణాలు గొంతులో చేరితే చికాగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే బెల్లం తినాలి. బెల్లాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల గొంతుపై రక్షణ కవచం ఉన్నట్టే. గొంతులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది ఈ బెల్లం. ఈ కణాల వల్ల కలిగే దగ్గు కూడా నయం అవుతుంది. బ్రోన్కైటిస్, వీజింగ్, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ రుగ్మతలను నయం చేయడంలో సహాయపడుతుంది బెల్లం. బెల్లం వల్ల మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరిగే అవకాశం కూడా ఉండదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే కాస్త బెల్లం తినండి చాలు. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. బెల్లాని ఆంటి అలెర్జీక్ తత్వం దమ్ము ఆస్తమా రోగులకు మేలు చేస్తుంది.