https://oktelugu.com/

skins : తొక్కలను తీసి పారేస్తున్నారా? కానీ చాలా ప్రయోజనాలు బాస్..

వంట వండేటప్పుడు కూరగాయల తొక్క తీసి వాడటం కామన్ కదా. అలాగే కొన్ని పండ్లను తినే ముందు కూడా ఇదే విధంగా తొక్కలు తీసి తింటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 9, 2024 / 03:48 PM IST

    skins

    Follow us on

    skins : వంట వండేటప్పుడు కూరగాయల తొక్క తీసి వాడటం కామన్ కదా. అలాగే కొన్ని పండ్లను తినే ముందు కూడా ఇదే విధంగా తొక్కలు తీసి తింటారు. అయితే, కూరగాయలు, పండ్ల తొక్కలు తీసిన తర్వాత ఏం చేస్తారు. జస్ట్ డస్ట్ బిన్ లో పడేస్తారు కదా. కానీ ఇలా పడేయకుండా కొన్ని పద్ధతుల్లో తొక్కలను కూడా ప్రయోజనకంగా వాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఈ తొక్కలు కూడా ఎక్కువగా పోషకాలను కలిగి ఉంటాయని వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు అని అంట్నారు. ఇవి కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని వివిధ మార్గాల్లో వినియోగించుకోవచ్చు.

    బంగాళదుంపలను చాలా విధాలుగా ఉపయోగిస్తారు. అయితే బంగాళాదుంప తొక్కను పనికిరానిదిగా విసిరివేయడం మాత్రం మానుకోవాలి. ఇందులో విటమిన్లు, ఎంజైమ్‌లు ఎక్కువగా లభిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాయి ఈ బంగాళదుంప తొక్కలు. వీటిని 10 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. కూల్ గా అయిన తర్వాత కళ్ల చుట్టూ అప్లై చేసి, పదిహేను నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత చల్లని నీటితో కళ్లను కడగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు పూర్తిగా మాయం అవుతాయి.

    ఆరెంజ్ తొక్కలో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి. తొక్క లోపలి భాగంతో దంతాలను స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే పసుపుపచ్చ దంతాలు తెల్లగా అవుతాయి అంటున్నారు నిపుణులు. ఇది పంటి ఎనామిల్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా నారింజ తొక్క సహజసిద్ధమైన క్రిమి సంహారిణి.దీని వాసనకు క్రిములు కూడా రావు. యాపిల్ తొక్కలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. దీని వల్ల చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. యాపిల్ తొక్కను ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడ వల్ల మొటిమలు రావు. మరిన్ని చర్మ సమస్యలు దూరం అవుతాయి.

    దోసకాయ తొక్కను ముఖానికి రాసుకున్నా సరే మంచి గ్లో వస్తుంది. చర్మంపై విష రసాయనాలను తొలగిస్తుంది దోసకాయ గుజ్జు. అలాగే అరటిపండు తిని తొక్కను విసిరేయకండి. దీన్ని షూ పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చు. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని బూట్లపై రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల బూట్లపై ఉన్న మురికి, దుమ్ము క్లీన్ అవుతుంది.

    నారింజలో విటమిన్ సీ ఉంటుంది. దీనిలో సహజ నూనెలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆరెంజ్ తొక్క మొటిమలను, మచ్చలను తొలగిస్తుంది. కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది నారింజ. నారింజ తొక్కను ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. పెరుగుతో కలిపి ముఖానికి ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్నా ఒకే. మంచి ఫలితాలు ఉంటాయి.