Tulsi plants : తులసి చెట్టు ఎండిపోయిందా? ఇలా చేయండి.. తులసి ప్రయోజనాలు ఇవే..

సబ్ హెడ్డింగ్: తులసి చెట్టు మీ ఇంట్లో ఉందా? కానీ ఈ చెట్టు ఎండిపోతుంది. అయితే తులసి చెట్టు ఎండిపోయిన, చీమలు పట్టిన కూడా ఈ టిప్స్ ఉపయోగించండి. వెంటనే పచ్చగా మారుతుంది.

Written By: Swathi, Updated On : July 25, 2024 10:21 pm
Follow us on

Tulsi plants : హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మొక్కను దేవతగా కొలుస్తుంటారు. ప్రతి హిందూ కుటుంబంలో ఈ మొక్క కనిపిస్తుంటుంది. ఉదయం లేచి పూజలు కూడా చేస్తుంటారు. తులసిని పూజించడం సర్వసాధారణంగా చూస్తుంటాము. అయితే ప్రతి రోజు ఉదయం నీరు కూడా ఈ మొక్కకు పోస్తుంటారు భక్తులు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మొక్క కొన్ని సార్లు ఎండిపోతుంది. ఇక ఎండాకాలం మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇంట్లో ఈ మొక్క ఎండిపోవడం గమనిస్తుంటాము. మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు తులసి మొక్కను ఎండిపోకుండా పచ్చగా ఉండేలా కూడా ఎలా చేయాలో ఓ సారి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఎండిన తులసికి జీవం పోసి పచ్చగా మార్చే హోం రెమెడీస్ లను తెలుసుకొని ఆ జాగ్రత్తలు మీరు పాటిస్తే వెంటనే మీ మొక్క పచ్చగా మారుతుంది. తులసిని ఔషధ మొక్కగా పరిగణిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని టిప్స్ తులసి మొక్కకు కొత్త జీవితాన్ని ఇస్తాయి.

ఇది కేవలం తులసికి మాత్రమే కాదు ప్రతి వంటకంలో ఉపయోగిస్తుంటారు. అదేంటో కాదు పసుపు. పసుపును సాధారణంగా అన్ని రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కూరగాయల నుంచి పప్పు వరకు ఇలా చాలా వంటల్లో పసుపు ఉంటుంది. వంటకు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది పసుపు. ఇది కేవలం మనుషులకు, వంటలకు మాత్రమే కాదు మొక్కలకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? మొక్క ఎదుగుదలకు పసుపు చాలా సహాయం చేస్తుంది. మొక్క నేల ఎండిపోతుంటే, పసుపును కలపండి చాలు. మంచి ఫలితాలు ఉంటాయి. పసుపును నేలలో కలపడం వల్ల నేల సారవంతం అవుతుంది.

ఎండిపోయిన తులసి మొక్కలకు పసుపు కలిపితే మళ్లీ మంచి ఆకులు వస్తాయి అంటున్నారు నిపుణులు. మొక్కలకు క్రిమి సంహారిణి గా పనిచేస్తుంది పసుపు. తులసి మొక్కలో పురుగులు ఉంటే పసుపు వేస్తే వెంటనే అవి చనిపోతాయి. వేసవి కాలంలో తులసి మొక్కలకు ఎక్కువగా చీమలు పడుతుంటాయి. కాబట్టి పసుపును ఉపయోగించడం వల్ల ఈ చీమలు కూడా పోతాయి.తులసి ఆకుల మీద పసుపు నీటిని పిచికారీ చేయాలి . తులసి మూలాలో పసుపు పొడిని వేయండి. చీమలు పోవడం మాత్రమే కాదు మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

తులసితో ప్రయోజనాలు..

రోజుకు 5 నుంచి 7 తులసి ఆకులను క్రమం తప్పకుండా తింటే కొన్ని రోజుల్లోనే మీరు మంచి ఫలితాలను చూస్తారు. శరీరంలో ఉన్న కొన్ని రుగ్మతలను తగ్గించడంతో పాటు కొన్ని వ్యాధులను రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది తులసి. చెడు కొవ్వును తగ్గిస్తుంది. అందుకే తులసిని ఆయుర్వేదంలో దివ్య ఔషధం గా పేర్కొంటారు. తులసి ఆకులను రోజూ తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో బ్లడ్ షుగర్ స్థాయులను తగ్గిస్తుంది తులసి.

తులసిలో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలే ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. వీటితో పాటు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను కూడా తగ్గిస్తాయి. ఈ ఆకులు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటితో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తులసి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న తులసిని మీ ఇంట్లో పెట్టుకోవాల్సిందే. దీనికి ఏమైనా సమస్యలు వస్తే మాత్రం కచ్చితంగా దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే తులసిని మీరు రక్షిస్తే మిమ్మల్ని తులసి రక్షిస్తుంది.