https://oktelugu.com/

Mahesh – Rajamouli : మహేష్ -రాజమౌళి మూవీ హాలీవుడ్ రేంజ్ కు చేరుతుందా? అంతటి కథా, కథనం ఉందా.?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డ్ లను నమోదు చేసిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి... ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 25, 2024 / 10:27 PM IST

    Rajamouli Mahesh

    Follow us on

    Mahesh – Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికీ రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు లేరనే చెప్పాలి. ఇక ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. ఇక ఆయన సినిమాలో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తూ ఉంటాడు. అందువల్లే అయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా అందరి డైరెక్టర్లకంటే ఆయనను ఉన్నత స్థానంలో నిలబడేలా చేశాయి…బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళి అనుకుంటున్నట్టుగానే పాన్ వరల్డ్ లో సినిమా చేసి సక్సెస్ ఫుల్ గా నిలిపే అంత సత్తా రాజమౌళికి ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని కొట్టడం ఈజీనే కానీ హాలీవుడ్ తెరపైన సక్సెస్ కొట్టాలి అంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మనం చేసే సినిమాలు వాళ్ళు ఇప్పటివరకు చాలానే చూసుంటారు. కాబట్టి మన సినిమాలతో వారిని మెప్పించాలంటే వాళ్ళు చూసే సినిమాలు కాకుండా కొత్తగా ఒక సినిమా అయితే చేయాల్సి ఉంటుంది. మరి అందులో రాజమౌళి ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా హాలీవుడ్ లో అప్పుడెప్పుడో వచ్చిన ‘ఇండియానా జోన్స్’ ఆధారంగా తీసుకొని కథను రాసుకున్నట్టుగా విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. మరి వాళ్ళు అలాంటి సినిమాలను ఇప్పటివరకు కొన్ని వందల్లో చూసుంటారు. ఇక రాజమౌళి తీసే సినిమా వాళ్లకు నచ్చుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రాజమౌళి ఒక భారీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ కథ, కథనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప హాలీవుడ్ తెరపైన మన సినిమా అనేది ఆడదు.

    ఇక హాలీవుడ్ తెర మీద మన సినిమాను ఆడించే ప్రయత్నం చేస్తున్నందుకు రాజమౌళిని మెచ్చుకోవాలి. కానీ అది సక్సెస్ ఫుల్ గా చేయగలిగితే మాత్రం రాజమౌళి ని మించిన టాప్ డైరెక్టర్ ఇక ఇండియాలో మరొకరు లేరు అనేది మాత్రం ప్రూవ్ అవుతుంది. అలాగే హాలీవుడ్ తెరమీద కూడా రాజమౌళికి ఒక గుర్తింపు లభించడమే కాకుండా అక్కడున్న కొంతమంది టాప్ డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకడిగా ఎదుగుతాడు. మరి అలాంటి క్రమంలో రాజమౌళి చేసే సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…

    ఇక ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి రాజమౌళి చేసే సినిమాలు పకడ్బందీ కథ, కథనంతో వస్తాయి. కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫైనల్ చేసుకున్న తర్వాతే ఆయన ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…