https://oktelugu.com/

Children’s food: పిల్లలకు ఈ ఆహారం తినిపిస్తే ప్రమాదం అట.. జాగ్రత్త

Children’s food: ఆహార పదార్థాల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి. పిల్లలకు ఏది పడితే అది పెట్టకూడదు. నూనెలో వేయించిన పదార్థాలతో అనర్థాలు ఎక్కువే ఉంటాయి. మారుతున్న కాలంలో ఎక్కువగా బేకరీ ఫుడ్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిరుతిళ్లతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా వారికి అనారోగ్యాల ప్రమాదం పొంచి ఉంటోంది. అయినా తల్లిదండ్రుల్లో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. వారు అడిగిందే తడవుగా ఏదైనా ఇచ్చేందుకు ముదుకు రాకూడదు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 12, 2021 / 11:36 AM IST
    Follow us on

    Children’s food: ఆహార పదార్థాల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి. పిల్లలకు ఏది పడితే అది పెట్టకూడదు. నూనెలో వేయించిన పదార్థాలతో అనర్థాలు ఎక్కువే ఉంటాయి. మారుతున్న కాలంలో ఎక్కువగా బేకరీ ఫుడ్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిరుతిళ్లతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా వారికి అనారోగ్యాల ప్రమాదం పొంచి ఉంటోంది. అయినా తల్లిదండ్రుల్లో నిర్లక్ష్యమే కనిపిస్తోంది.

    Children’s food

    వారు అడిగిందే తడవుగా ఏదైనా ఇచ్చేందుకు ముదుకు రాకూడదు. ఆలోచించి పదార్థాల ఎంపిక చేసుకోవాలి. చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండే చాక్లెట్లు తింటే కొవ్వు పెరుగుతుందని తెలుసుకోవాలి. ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది. కానీ బజారులో దొరికే వాటికి ఎక్కువ విలువ ఇస్తే అంతే సంగతి అని గుర్తుంచుకోవాలి.

    పిల్లలు మారాం చేస్తే చాలు దుకాణాల్లో దొరికే వాటిని కొనిస్తూ ఉంటారు. దీంతో చాలా ప్రమాదకరం. వాటిలో వాడే పదార్థాలు పిల్లలకు మేలు కంటే చేటు ఎక్కువగా చేస్తాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసినా ఒకసారి తింటే ఏమవుతుంది లే అనే నిర్లక్ష్యమే వద్దు అని సూచిస్తున్నారు. బయట తీసుకునే పదార్థాల వల్ల కలిగే దుష్ర్పభావాలను దృష్టిలో పెట్టుకోవాలి.

    Also Read: కర్పూరం పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలుసా?
    నిలువ ఉండే పదార్థాలతో అధిక నష్టం కలుగుతుంది. దీంతో వాటిని కొనుగోలు చేసే బదులు ఇంట్లోనే పిల్లలకు ఏం కావాలన్నా తయారు చేసి ఇవ్వొచ్చు. దీంతో మనం అధిక చక్కెర, నూనె పదార్థాలే ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. దీంతో మనం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపించే జంక్ ఫుడ్స్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Also Read: పూజకు ఉపయోగించే ఈ పుష్పాలను పొరపాటున కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు.. ఎందుకో తెలుసా?

    Tags