ఈ మధ్య కాలంలో చాలామంది బరువు తగ్గాలనే ఆలోచనతో, ఇతర కారణాల వల్ల రాత్రి సమయంలో చపాతీని మాత్రమే అన్నం మానేసి తీసుకుంటున్నారు. అయితే వైద్య నిపుణులు రాత్రిపూట చపాతీని మాత్రమే తీసుకున్నా ఇబ్బందులు తప్పవని వెల్లడిస్తున్నారు. చపాతీలను ఎక్కువగా తింటే ఎలర్జీలు, గ్లూటెన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చపాతీల వల్ల తలనొప్పి, విరేచనాలు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Also Read: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలా.. పాటించాల్సిన చిట్కాలివే..?
రాత్రిపూట పూర్తిగా అన్నం తినడం మానేయకుండా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకోవాలని గోధుమపిండితో చేసిన చపాతీల వల్ల శరీరంలో చేరే గ్లూటెన్, గ్లయాటిన్ అనే ప్రోటీన్లు ప్రేగులకు అంటుకుంటాయని.. అకస్మాత్తుగా చపాతీలు తినడం ప్రారంభిస్తే ఒకేసారి ఎక్కువ మొత్తం తీసుకోకుండా గోధుమల పరిమాణం అంతకంతకూ పెంచుకుంటూ పోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also Read: అంజీరా పండ్ల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?
చాలామంది రాత్రిపూట చపాతీలు తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే అన్నంతో పోలిస్తే గ్లైసమిక్ ఇండెక్స్ చపాతీలో కొంచెం మాత్రమే తక్కువగా ఉంటుందని చపాతీలకు బదులుగా దంపుడు బియ్యం తిన్నా సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో ప్రాసెస్ చేసిన గోధుమపిండి షుగర్ లెవెల్స్ ను పెద్దగా తగ్గించదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
వైద్య నిపుణులు బరువు తగ్గాలని భావించే వాళ్లు వ్యాయామాలు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. రాత్రిపూట చపాతీని మాత్రమే తిని బరువు తగ్గాలని అనుకోవడం సరి కాదని వెల్లడిస్తున్నారు.