https://oktelugu.com/

Health Tips : ఆరోగ్యానికి వాకింగ్ మంచిదా? రన్నింగ్ మంచిదా?

కొంతమంది వాళ్ల వర్క్స్‌తో బిజీగా ఉంటారు. దీంతో చిన్న విషయాలకి కోపం, ఆందోళన చెందుతారు. అదే వ్యాయామం చేస్తే అలాంటి సమస్యలు ఉండవు. మీ మైండ్ బాగా పనిచేయడంతో పాటు మంచి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంటుంది. అయితే రోజూ వ్యాయామం చేసేవాళ్లు వాకింగ్ చేయడం మంచిదా? లేకపోతే రన్నింగ్ చేయడం మంచిదా? అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2024 / 03:36 AM IST

    Walking or Running

    Follow us on

    Health Tips :  ఆరోగ్యంగా ఉండాలంటే మంచి తిండి, సరైన నిద్ర, వ్యాయామం తప్పనిసరి. కొంతమంది అయితే ఈ వ్యాయామం కోసం ప్రతిరోజు సమయం కేటాయిస్తారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుందని నమ్ముతారు. అయితే వ్యాయామం చేసేటప్పుడు కొందరు వాకింగ్ చేస్తే మరికొందరు రన్నింగ్ చేస్తారు. అసలు రెండింటిలో ఏది మంచిది. రెండింటికి వేర్వేరుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే మైండ్ చాలా రిఫ్రెష్‌గా కూడా ఉంటుంది. లైఫ్ గజి బిజీగా కాకుండా ఒక ప్లానింగ్ మీద చిరాకు లేకుండా రోజంతా ఉంటారు. కొంతమంది వాళ్ల వర్క్స్‌తో బిజీగా ఉంటారు. దీంతో చిన్న విషయాలకి కోపం, ఆందోళన చెందుతారు. అదే వ్యాయామం చేస్తే అలాంటి సమస్యలు ఉండవు. మీ మైండ్ బాగా పనిచేయడంతో పాటు మంచి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంటుంది. అయితే రోజూ వ్యాయామం చేసేవాళ్లు వాకింగ్ చేయడం మంచిదా? లేకపోతే రన్నింగ్ చేయడం మంచిదా? అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.

    వాకింగ్‌తో ప్రయోజనాలు
    వాకింగ్, రన్నింగ్ రెండు ఆరోగ్యానికి మంచివే. రెండింటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాకపోతే ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్లు ఎంచుకోవాలి. అయితే రన్నింగ్ చేయడం వల్ల కేలరీలు తొందరగా బర్న్ అవుతాయి. నడకలో అయితే తక్కువగా అవుతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లకు వాకింగ్ కంటే రన్నింగ్ బెటర్. వ్యాయామం కొత్తగా ప్రారంభించినట్లయితే వాకింగ్ ఎంచుకోవడం మేలు. ఎందుకంటే రన్నింగ్ ఒక్కసారిగా చేయడం కష్టమవుతుంది. కాబట్టి కొన్ని రోజులు వాకింగ్ చేయాలి. ఆ తర్వాత రన్నింగ్ చేయడం మొదలుపెట్టాలి. కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు, కండరాల నొప్పులు ఉన్నట్లయితే వాకింగ్ చేయడం మంచిది. వాకింగ్ చేయడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే బాడీగా ఫిట్‌గా ఉండటంతో పాటు కడుపునొప్ప, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను కూడా వాకింగ్‌తో తగ్గించుకోవచ్చు.

    రన్నింగ్‌తో ప్రయోజనాలు
    గుండె సమస్యలు ఉన్నవాళ్లు రన్నింగ్ అంతగా చేయకపోవడం మంచిది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. రోజూ రన్నింగ్ చేయడం వల్ల తొందరగా బరువు తగ్గవచ్చు. వాకింగ్ కంటే రన్నింగ్ కండరాలను బలపరుస్తుంది. అలాగే ఎముకల సాంద్రతను పెంచి.. ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట నిద్రపట్టని వాళ్లు రెగ్యులర్‌గా రన్నింగ్ చేస్తే మంచిగా నిద్ర పడుతుంది. ఎందుకంటే బాడీ బాగా అలిసి పోయి ఉంటుంది. దీంతో రాత్రి సమయం అంతగా మెలుకవలో ఉండరు. హ్యాపీగా నిద్రపోతారు. రన్నింగ్ చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ మార్పిడి సామర్థ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది. అలాగే మెదడు జ్ఞాపకశక్తి పెరిగేలా చేయడంతో పాటు మైండ్ ఎప్పుడు ఒత్తిడికి గురికాకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. వాకింగ్‌, రన్నింగ్‌ కూడా ఆరోగ్యానికి మంచివే. కానీ వాళ్ల ఆరోగ్య సమస్యలను బట్టి మీరు ఎంచుకోవాలి.