spot_img
Homeలైఫ్ స్టైల్Relationship Secrets : భర్తల దగ్గర భార్యలు హైడ్ చేసే విషయాలేంటి? ఎందుకు హైడ్ చేస్తారు

Relationship Secrets : భర్తల దగ్గర భార్యలు హైడ్ చేసే విషయాలేంటి? ఎందుకు హైడ్ చేస్తారు

Relationship Secrets : భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని పెద్దలు అంటుంటారు. తన భర్తతో అన్ని విషయాలు చర్చించుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, ఒక ఫ్రెండ్‌లా భర్తను ట్రీట్ చేయాలని అంటారు. అయితే భర్త ఏంత మంచిగా భార్యను చూసుకున్న, భార్యలు మాత్రం భర్త దగ్గర కొన్ని విషయాలను దాస్తుంటారు. అసలు భర్త దగ్గర భార్య దాయాల్సిన విషయాలు ఏముంటాయని చాలామంది ఆలోచిస్తారు. సాధారణంగా చాలామంది భార్యలు వాళ్ల భర్తలతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. రోజులో ఏం జరిగింది? ఏం చేశారు? ఎవరు ఏమన్నారనే? విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం భర్త దగ్గర దాచేస్తారట. ఇంతకీ భార్యలు భర్తల దగ్గర దాచే విషయాలు ఏంటి? అసలు భర్తలు దగ్గర దాచాల్సిన అవసరం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

పెళ్లికి ముందు వాళ్ల లైఫ్‌లో జరిగే విషయాల్ని భార్య అస్సలు భర్తకు చెప్పదు. ఎందుకంటే వాటివల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని కొన్ని విషయాలను దాచిపెడుతుంది. అలాగే ఇంట్లో జరిగే విషయాలను, తన కన్నవారింటి విషయాలను కూడా భార్య భర్తకు చెప్పదు. అవన్నీ చెబితే భర్త పుట్టింటి గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు ఏమోనని దాచేస్తుంది. ఎందుకంటే వీటివల్ల ఏదో రోజు సమస్య వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ విషయాలేవి చెప్పదు. భార్యలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. వాటిని అంత తొందరగా భర్తల దగ్గర చెప్పరు. చిన్న ఆరోగ్య సమస్య అయిన భర్తలు ఎక్కువగా ఆలోచిస్తారట. అందుకే భర్తకు తెలియకుండా భార్య దాచేస్తుంది. భార్య ఎక్కువగా తన వైపు చుట్టాలని చూస్తుందని చాలామంది అనుకుంటారు. ఇలాంటి తన కన్నవారికి ఏవైనా ఇచ్చినా, ఏం చేసినా అలాంటి విషయాలను భర్తకు తెలియకుండా ఉంచుతుందట.

జీవితంలో వాళ్లు సాధించాల్సిన కెరీర్ ప్లాన్‌ల గురించి చాలా భార్యలు భర్తలకు చెప్పరు. ఎందుకంటే వాటివల్ల ఇద్దరి మధ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని దాచేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో గొడవులు ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్న భర్తతో షేర్ చేసుకోరు. ఎందుకంటే భర్త తనకి సపోర్ట్ చేయకుండా వాళ్లకి సపోర్ట్ చేయడంతో పాటు వాటివల్ల వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయని చెప్పరు. తనకి డబ్బులు, ఇంకా ఏవైనా అవసరాలు వచ్చిన భర్తను అంత తొందరగా అడగలేరు. అలాంటి విషయాలు దాచేస్తారు. అలాగే వాళ్లు చేసే షాపింగ్, గోల్డ్, బట్టలు ఇలా ఏవైనా కొత్త వస్తువులను కొన్నా వెంటనే భర్తకు చెప్పరు. ఎందుకంటే డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారని భర్త తిడతారు ఏమోనని భయంతో భర్త దగ్గర దాచేస్తారు. అలాగే ఆర్థికపరమైన విషయాలు, ఏదైనా ల్యాండ్ కొన్నా, బిజినెస్ వంటివి కూడా కొందరు భార్యలు భర్తకు తెలియనివ్వరు. ఎందుకంటే నీకెందుకు ఇలాంటివి అని హేళన చేస్తారనే ఉద్దేశంతోనే చెప్పకుండా దాచేస్తారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
Exit mobile version