https://oktelugu.com/

బండి సంజయ్ మరో దుమారం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్గిరాజేస్తున్నారు.. ముఖ్యంగా ఒక మతాన్ని టార్గెట్ చేసిన ఆయన చేస్తున్న విమర్శలు కాకరేపుతున్నాయి. టీఆర్ఎస్ తో కయ్యానికి కాలుదువ్వుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.  దీంతో  జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. Also Read: టీఆర్ఎస్ వ్యూహానికి బీజేపీ సెల్ఫ్ గోల్..! తాజాగా మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేసేది పక్కా అని బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 / 07:01 PM IST
    Follow us on

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్గిరాజేస్తున్నారు.. ముఖ్యంగా ఒక మతాన్ని టార్గెట్ చేసిన ఆయన చేస్తున్న విమర్శలు కాకరేపుతున్నాయి. టీఆర్ఎస్ తో కయ్యానికి కాలుదువ్వుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.  దీంతో  జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది.

    Also Read: టీఆర్ఎస్ వ్యూహానికి బీజేపీ సెల్ఫ్ గోల్..!

    తాజాగా మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేసేది పక్కా అని బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికలను ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చారు. మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవాలా.. ఇండియా గెలవాలా అని పేర్కొన్నారు. ఇండియా ఓడిపోతే నల్లాజెండాలతో నిరసన తెలిపిన వాళ్లను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు.

    పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాతబస్తీలోని రోహింగ్యాలను, పాకిస్తాన్ వారిని తరిమికొడతామని హెచ్చరించారు.  బండి వ్యాఖ్యలపై టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఎదురుదాడికి దిగాయి.

    Also Read: కేసీఆర్ వరాలపై మహేష్.. రాజమౌళి ఏమన్నారంటే?

    అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీని, ముస్లింలను, టీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ రాజకీయాలు నడుస్తున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్