https://oktelugu.com/

రాత్రి భోజనం తరువాత అరటిపండు తినవచ్చా..? తినకూడదా..?

మన దేశంలో ఎక్కువగా లభ్యమయ్యే పండ్లలో అరటిపండ్లు ముందువరసలో ఉంటాయి. ఆహారం సులభంగా జీర్ణం కావడంలో అరటిపండ్లు ఎంతగానో సహాయపడతాయి. అయితే అరటిపండ్ల విషయంలో నెలకొన్న కొన్ని అపోహల వల్ల చాలామంది అరటి పండ్లు తినడానికి ఆసక్తి చూపరు. రాత్రిపూట అరటిపండ్లు తినడం మంచిది కాదని చాలామంది నమ్ముతూ ఉంటారు. రాత్రి భోజనం తరువాత అరటిపండ్లను తింటే మంచిది. Also Read: కంటిచూపు మందగించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..? శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రాత్రిపూట అరటిపండ్లు తినడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2020 / 06:30 AM IST
    Follow us on


    మన దేశంలో ఎక్కువగా లభ్యమయ్యే పండ్లలో అరటిపండ్లు ముందువరసలో ఉంటాయి. ఆహారం సులభంగా జీర్ణం కావడంలో అరటిపండ్లు ఎంతగానో సహాయపడతాయి. అయితే అరటిపండ్ల విషయంలో నెలకొన్న కొన్ని అపోహల వల్ల చాలామంది అరటి పండ్లు తినడానికి ఆసక్తి చూపరు. రాత్రిపూట అరటిపండ్లు తినడం మంచిది కాదని చాలామంది నమ్ముతూ ఉంటారు. రాత్రి భోజనం తరువాత అరటిపండ్లను తింటే మంచిది.

    Also Read: కంటిచూపు మందగించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

    శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. అయితే దగ్గు, జలుబుతో బాధ పడే వాళ్లు మాత్రం రాత్రిపూట అరటిపండ్లను తినకపోవడమే మంచిది. అరటిపండ్లు తింటే దగ్గు, జలుబు సమస్యలు తగ్గడానికి మరింత సమయం పడుతుంది. చాలామంది రాత్రి సమయంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు.

    Also Read: మధుమేహ రోగులు శనగలు తినవచ్చా..? తినకూడదా..?

    అయితే జంక్ ఫుడ్ కంటే రాత్రి సమయంలో అరటిపండును తీసుకోవడం ఉత్తమం. అరటిపండును తినడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. పొటాషియం డెఫిషియన్సీతో బాధ పడే వాళ్లు ప్రతిరోజూ అరటి పండు తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అరటిపండు శరీర బరువును తగ్గించడంలో సైతం సహాయపడుతుంది. తీపి తినడం ఎక్కువగా ఇష్టపడేవారు అరటిపండు తింటే ఆ కోరికకు చెక్ పెట్టవచ్చు.

    మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

    చర్మసంబంధిత సమస్యలు, దురదలతో తరచూ బాధ పడేవాళ్లు ప్రతిరోజూ అరటిపండ్లను తీసుకోవడం ద్వారా ఆ సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. శరీరంలో తెల్లరక్త కణాల సంఖ్యను పెంచడంలో అరటి పండ్లు సహాయపడతాయి. అందువల్ల రాత్రి సమయంలో అరటిపండ్లు తినాలనుకునే వాళ్లు ఎలాంటి సందేహం లేకుండా నిశ్చితంగా తినవచ్చు.