దేశంలో రోజురోజుకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. అదే సమయంలో వృత్తిరిత్యా కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల సహాయంతో ఎక్కువ సమయం పని చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు వినియోగించడం వల్ల చాలామంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
Also Read: తెల్ల జుట్టును నల్లగా మార్చటానికి పాటించాల్సిన చిట్కాలివే..?
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ ఎక్కువ సమయం వినియోగించే వారిలో కంటిచూపు మందగిస్తోంది. కొన్ని ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ ఎ పుష్కలంగా అందితే కంటిచూపు మెరుగుపడుతుంది. కంటిచూపు మెరుగుపడాలంటే క్యారెట్ ను ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, బీటా కెరాటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Also Read: భారత ప్రజలకు శుభవార్త.. వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారంటే..?
ప్రతిరోజూ చేపలు తింటే కంటి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు కంటిచూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఇ, జింక్ సమృద్ధిగా ఉండే బాదం, వాల్ నట్ తీసుకున్నా కంటి సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. కంటిచూపును మెరుగుపరచడంతో పాలకూర సైతం ఉపయోగపడుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే పాలకూర కంటి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
ప్రతిరోజూ కోడిగుడ్డును డైట్ లో చేర్చుకున్నా సులువుగా కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ వెల్లుల్లిని ఎవరైతే తీసుకుంటారో వారికి వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.