గత కొంత కాలాంగా మన్సాస్ వివాదంతో సతమతమవుతున్న అశోక్ గజపతి రాజుకు ఇప్పుడో కొత్త సమస్య ఎదురైంది. ఈ సారి కుటుంబం నుంచి కాకుండా పార్టీ నుంచి తలనొప్పులు వస్తున్నాయి. విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా మీసాల గీత కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్ని రోజులు టీడీపి కార్యకలాపాలు అశోక్ గజపతి రాజు నివాసంలోనే కార్యకలాపాలు నడిచేవి. కానీ తాజాగా మీసాల గీత కొత్తగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఆ రాజకీయలకు చంద్రబాబు గుడ్ బై..?
2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన అశోక్ గజపతిరాజు ఎంపీగా, మీసాల గీత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జరిగిన గత ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు తన కుమార్తె అదితి గజపతిరాజుల రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. దీంతో రాను రాను తమకు ప్రాధాన్యం తగ్గుతుందని మీసాల గీత అప్పటి నుంచే అసంత్రుప్తితో ఉన్నారు. దీంతో ఆమె సొంతంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కొంత మంది నేతలు మాత్రమే హాజరయ్యారు.
Also Read: ముందు రైతు.. వెనక మోడీ..!
అయితే అశోక్ గజపతి రాజు మాత్రం వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేయడం కోసమే గీత ఇలా చేస్తుందని ఆరోపిస్తున్నారు. టీడీపీని దెబ్బ కొట్టడానికే ఆమె ఇలాంటి ప్రణాళిక చేపడుతుందంటున్నారు. పార్టీని బలహీన పర్చడానికి కుట్రలు పన్నుతుందంటున్నారు. అయితే ఈ వ్యవహారంతో చివరికి విజయనగరం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ విషయంపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తాడోనని ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్