Homeహెల్త్‌Monsoon Leafy Vegetables: వర్షాకాలంలో ఆకు కూరలు తింటే అనారోగ్యమా.. అసలు నిజమేంటీ.

Monsoon Leafy Vegetables: వర్షాకాలంలో ఆకు కూరలు తింటే అనారోగ్యమా.. అసలు నిజమేంటీ.

Monsoon Leafy Vegetables: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా మంది ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఆకుకూరలు తినడానికి భయపడుతుంటారు. ఎందుకంటే వర్షాకాలంలో ఆకుకూరలు తింటే విరేచనాలు, కడుపు ఇన్‌ఫెక్షన్లు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరల వల్ల కాదు, వాటిని శుభ్రంగా కడగకుండా వండుకుని తినడం వల్లే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు వర్షాకాలంలో ఆకు కూరలు తినొచ్చా?

ఆకుకూరలు శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్, కాల్షియం, ఫైబర్, విటమిన్ A, C, K వంటి పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

అయితే వర్షాకాలంలో ఆకుకూరలు తినడం వల్లే డయేరియా వస్తుందని కొందరి అపోహ మాత్రమే. నిజానికి కలుషితమైన ఆకుకూరలు లేదా శుభ్రం చేయని ఆహారం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే విరేచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య ఆకుకూరల్లో కాదు, వాటి పరిశుభ్రతలోనే ఉందని వైద్యులు చెబుతున్నారు.

అయితే వాటిని శుభ్రపరచడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెబుతున్నారు. సాధారణంగా ఆకు కూరలు పొలాల్లో మట్టి, బురద వంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ముఖ్యంగా పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర వంటి ఆకుకూరల ఆకులపై మట్టి, దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుల గుడ్లు, కీటకాలు అంటుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటిని శుభ్రం చేయకుండా వండితే బ్యాక్టీరియా, పరాన్నజీవులు శరీరంలోకి చేరి జీర్ణాశయ సమస్యలు కలిగించవచ్చు.

ఆకుకూరలను ముందుగా పసుపు రంగు లేదా పాడైన ఆకులను తొలగించాలి. తర్వాత ఒక పాత్రలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ వేసి ఆకుకూరలను సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి. దీంతో ఆకులపై ఉండే మట్టి, చిన్న కీటకాలు, కొన్ని సూక్ష్మజీవులు తొలగిపోవడానికి సహాయపడుతుంది. అనంతరం శుభ్రమైన నీటితో రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి వండుకోవాలి.

పోషకాహార నిపుణుల సూచన ప్రకారం ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు సుమారు 50 గ్రాముల ఆకుకూరలు ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే ఒక్క రకమైన ఆకుకూర మాత్రమే కాకుండా వారంలో వివిధ రకాల ఆకుకూరలను మారుస్తూ తీసుకోవడం మంచిది. దీంతో శరీరానికి విభిన్న రకాల పోషకాలు అందుతాయి.

చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఆకుకూరలను తప్పనిసరిగా బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకునే ఆకుకూరల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయట విక్రయించే శుభ్రత లేని ఆకుకూరలను కొనుగోలు చేయకుండా తాజా, నాణ్యమైన వాటినే ఎంచుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version